‘ఆ ఘటన వెనుక ఎవరున్నారు?.. వారిద్దరూ ఎందుకు ఖండించలేదు’ | Dokka Manikya Varaprasad Comments On Chandrababu Pawan kalyan | Sakshi
Sakshi News home page

‘ఆ ఘటన వెనుక ఎవరున్నారు?.. వారిద్దరూ ఎందుకు ఖండించలేదు’

Published Sat, Jun 25 2022 5:00 PM | Last Updated on Sat, Jun 25 2022 5:43 PM

Dokka Manikya Varaprasad Comments On Chandrababu Pawan kalyan - Sakshi

సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లాకు బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టడం చారిత్రక నిర్ణయం అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సామాజిక న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్‌ మాత్రమేనన్నారు. అంబేద్కర్‌ పేరు పెట్టడం దళితులందరికీ ఎంతో గర్వకారణమన్నారు.
చదవండి: ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ

కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ అల్లర్ల ఘటనను ఇంతవరకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఖండించలేదని దుయ్యబట్టారు. ఆ అల్లర్ల వెనుక ఎవరున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. రాజ్యాంగ నిర్మాతను కులాలకు అతీతంగా చూడాలి. బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పాటిస్తూ ఆయన్ని వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించారు. అల్లరిమూకలను దూరంగా పెట్టాలని కోనసీమ ప్రజలకు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement