కొణతాల రామకృష్ణకు సతీ వియోగం
విశాఖ : మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సతీమణి పద్మావతి మరణించారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందారు. కాగా పద్మావతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా కొణతాలకు పలువురు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.