kondareddypalle village
-
సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి.. అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
సాక్షి నాగర్ కర్నూలు: కొండాపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయితీ కార్యాలయం, గ్రంథాలయం, పశువైద్యశాల, బీసీ కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. నాలుగు వరుసల బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మిల్క్ బల్క్ కూలింగ్ సెంటర్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.కాగా, సీఎం రేవంత్‌రెడ్డి గత 20 ఏళ్లుగా దసరా పండుగ రోజు స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులతో కలిసి జమ్మికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో రావడం విశేషం. సీఎం సొంత ఇంటి నుంచి జమ్మి చెట్టు వరకు రోడ్డును ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ లైట్లను అమర్చారు. -
ప్రకాష్ రాజ్.. శ్రీమంతుడయ్యాడు!
అవును... సినీనటుడు ప్రకాష్ రాజ్ శ్రీమంతుడయ్యాడు. ఆయన ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో నటిస్తున్నారు కాబట్టి ముందే శ్రీమంతుడు అయ్యారని డౌటొచ్చిందా? అదేనండీ.. శ్రీమంతుడు సినిమాలో చూపించినట్లుగా, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమం స్ఫూర్తితో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోడానికి ఆయన ముందుకొచ్చారు. ఈ విషయం గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావును సోమవారం కలిశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లె అనే గ్రామాన్ని తాను దత్తత తీసుకుని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. దానికి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. Had a far reaching meeting with minister Mr KTR in connection with adopting a village . Journey begins.. Details soon pic.twitter.com/A5Y7k8MJHZ — Prakash Raj (@prakashraaj) September 7, 2015 @prakashraaj would be adopting Kondareddipalle village in Mahabubnagar dist. pic.twitter.com/B91kI0w1Ut — Min IT, Telangana (@MinIT_Telangana) September 7, 2015