జూనియర్ ఇంటర్లో 64 ఉత్తీర్ణత
ఎంపీసీలో 466/470
నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కళాశాల విద్యార్థి కొండూరు కార్తికేయన్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు.
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో జిల్లా 64 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత నెల్లో ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి ఏడాది ఫలితాలను ఇంటర్‌బోర్డు సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 26,947 మంది మొదటి ఏడాది పరీక్షలు రాశారు. వీరిలో 17,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 64 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో నాల్గోస్థానాన్ని జిల్లా దక్కించుకొంది. గత ఏడాది కూడా ఇవే ఫలితాలు వచ్చాయి.
ఈ ఏడాది 14,384 మంది బాలురు పరీక్ష రాయగా 8,885 మంది ఉత్తీర్ణులై 62 శాతం సాధించారు. 12,563 మంది బాలికలు పరీక్ష రాయగా 8,396 మంది ఉత్తీర్ణత సాధించి 67 శాతం నమోదు చేశారు. సరాసరి 64 శాతం విజయం సాధించినప్పటికీ ఫలితాల్లో బాలికలదే పైచేయి.
రాష్ట్రంలో కృష్ణా, రంగారెడ్డి, విశాఖపట్టణం జిల్లాల తర్వాత నెల్లూరులో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి, అధిక మార్కులు సాధిం చాలనుకునే వారికి ప్రభుత్వం వచ్చే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. మే 6వ తేదీ లోపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.