koti medical college
-
కోఠి మెడికల్ కాలేజ్ వద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కోఠి మెడికల్ కాలేజ్ బస్టాప్ వద్ద ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. కాగా బస్టాప్‌కు ఆనుకొని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్య్కూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తేలింది. కాగా షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి బస్టాప్ పక్కనే ఉన్న ఫుట్‌వేర్ షాపుతో పాటు బట్టల దుకాణం దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్డౌన్ అమల్లో ఉండడంతో ఆస్తి నష్టం తప్ప ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. -
కోఠిలో భారీగా కొత్త రూ.10 నోట్లు పట్టివేత
-
కోఠిలో భారీగా నగదు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: కోఠి మెడికల్ కాలేజ్ సమీపంలో భారీగా నగదు పట్టుబడింది. బుధవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా ఓ ఆటోలో తరలిస్తున్న డబ్బు సంచులను పోలీసులు గుర్తించారు. నగదు తరలిస్తున్న ఆటో డ్రైవర్ ప్రకాశ్‌ను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆరు సంచుల్లో రూ.12 లక్షల విలువ చేసే కొత్త రూ.10 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నింబోలి అడ్డలో ఓ ఏజెంట్ నుంచి కమీషన్‌పై తీసుకుని వ్యాపారస్తులకు అధిక కమీషన్‌ను అందజేస్తున్నట్టు డ్రైవర్ వెల్లడించాడు. -
రూ. 45 లక్షల చోరీ కేసు చేధించిన పోలీసులు
హైదరాబాద్: కోఠిలో మెడికల్ కాలేజీ వద్ద ఓ వ్యక్తి నుంచి రూ. 45 లక్షల చోరీ చేసిన కేసును నగర పోలీసులు బుధవారం చేధించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఏడాది ఆగస్టులో రూ. 45 లక్షలు తీసుకువెళ్తున్న వ్యక్తిపై ఆగంతకులు దాడి అతడి కళ్లలో కారం జల్లి... నగదు మొత్తాన్ని దొచుకున్నారు. అనంతరం ఆగంతకులు పరారైయ్యారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఈ రోజు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారిస్తున్నారు.