
ఆటోలో పట్టుబడ్డ నగదు
సాక్షి, హైదరాబాద్: కోఠి మెడికల్ కాలేజ్ సమీపంలో భారీగా నగదు పట్టుబడింది. బుధవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా ఓ ఆటోలో తరలిస్తున్న డబ్బు సంచులను పోలీసులు గుర్తించారు. నగదు తరలిస్తున్న ఆటో డ్రైవర్ ప్రకాశ్‌ను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఆరు సంచుల్లో రూ.12 లక్షల విలువ చేసే కొత్త రూ.10 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నింబోలి అడ్డలో ఓ ఏజెంట్ నుంచి కమీషన్‌పై తీసుకుని వ్యాపారస్తులకు అధిక కమీషన్‌ను అందజేస్తున్నట్టు డ్రైవర్ వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment