రూ. 45 లక్షల చోరీ కేసు చేధించిన పోలీసులు | Rs. 45 lakh 'robbery' case cracked | Sakshi
Sakshi News home page

రూ. 45 లక్షల చోరీ కేసు చేధించిన పోలీసులు

Published Wed, Oct 15 2014 11:15 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

Rs. 45 lakh 'robbery' case cracked

హైదరాబాద్: కోఠిలో మెడికల్ కాలేజీ వద్ద ఓ వ్యక్తి నుంచి రూ. 45 లక్షల చోరీ చేసిన కేసును నగర పోలీసులు బుధవారం చేధించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఏడాది ఆగస్టులో రూ. 45 లక్షలు తీసుకువెళ్తున్న వ్యక్తిపై ఆగంతకులు దాడి అతడి కళ్లలో కారం జల్లి...  నగదు మొత్తాన్ని దొచుకున్నారు.

అనంతరం ఆగంతకులు పరారైయ్యారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఈ రోజు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement