kotireddy
-
కార్మికుడికి అండగా సింగపూర్ తెలుగు సమాజం
విశాఖపట్నం : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కర్రి అరవింద్ (22) కుటుంబానికి సింగపూర్ తెలుగు సమాజం అండగా నిలిచింది. సింగపూర్‌లోని మెగాయార్డులో కర్రి అరవింద్ పని చేస్తున్నారు. సెలవులకి స్వస్థలం విశాఖపట్నం వచ్చినప్పుడు, స్నేహితుడితో కలిసి బైక్ మీద వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో అరవింద్ స్నేహితుడు మృతిచెందగా, అరవింద్ తీవ్ర గాయాలకు గురై కోమాలోకి వెళ్లారు. వారిది పేద కుటుంబం కావడంతో సింగపూర్ తెలుగు సమాజం సభ్యులు తలోక చేయి వేసి, తోటి కార్మిక మిత్రునికి చేయూతగా నిలిచారు. రూ. 2,50,000 ను వైద్య ఖర్చుల నిమిత్తం సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అరవింద్ తల్లికి అందజేశారు. సాటి తెలుగు వ్యక్తి ప్రమాదవశాత్తు ఆపదలో ఉన్నాడని తెలియగానే, సింగపూర్ తెలుగు సమాజం వారి పిలుపికి స్పందించి సకాలంలో సహాయాన్ని అందించిన వారందరికీ పేరు పేరునా సింగపూర్ తెలుగు సమాజం తరపున అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారికి, ముఖ్యంగా కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా సింగపూర్ తెలుగు సమాజం ముందుంటుందన్నారు. -
సింగపూర్ తెలుగు సమాజం 43వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు
సింగపూర్ : 44వ వసంతంలోనికి అడుగు పెడుతున్న శుభసందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భాదినోత్సవంతో పాటూ కార్తీక మాస విందు కార్యక్రమాన్ని స్థానిక పుంగోల్ లోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. ఆద్యంతం తెలుగుదనం, తెలుగు కళలు, సాహిత్యం ఉట్టిపడుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు మూడు తరాల ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానికి హాజరైన సమాజ పెద్దలు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని ఆ అనుభవాలను అందరితో పంచుకొన్నారు. 43 వసంతాల సమాజ ప్రస్థానాన్ని, మధురానుభూతులను, గత సంవత్సర కాలంలో సమాజం నిర్వహించిన కార్యక్రమాలను దృశ్యరూపకంగా ప్రదర్శించారు. పూర్వాధ్యక్షులతో సమాజ శ్రేయస్సును ఉద్దేశించి సాగిన ముఖాముఖి కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది. అనంతరం పూర్వాధ్యక్షులను, గత 43 సంవత్సరాలుగా సమాజానికి సేవలందిస్తున్న వ్యవస్ధాపక సభ్యురాలు కోమలవల్లిని సత్కరించారు. కార్యవర్గ కుటుంబ సభ్యుల సహకారంతో అందరికీ అచ్చతెలుగింటి వంటకాలతో పసందైన విందుని ఏర్పాటుచేశారు. సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి సభ్యులందరికి 43వ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ, వ్యవస్థాపకులకు , పూర్వాధ్యక్షులకు , వారికార్యవర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ లో ఉండే తెలుగు వారందరూ సమాజ సభ్యులుగా చేరాలని, ఎల్లప్పుడూ కలసికట్టుగా ఉండాలని, తెలుగు భవన నిర్మాణ కలను సాకారం చేసుకొనే దిశగా అందరూ తప్పకుండా సహాయ సహకారాలందించాలని విజ్ఞప్తి చేశారు. గత కొన్నిసంవత్సరాలుగా సింగపూర్ లోని బాలబాలికలకు తెలుగు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించే మనబడిలో భోదించే ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను కార్య నిర్వాహక కార్యదర్శి ప్రదీప్ సుంకర సభ్యులకు పరిచయం చేసి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సమాజం సభ్యులకు మాత్రమే నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది హాజరయ్యారని కార్యక్రమనిర్వాహకులు సత్య సూరిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులకు, కార్యవర్గానికి సహకారాన్నందిస్తున్న స్పాన్సర్స్ కి కార్యదర్శి సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు. -
‘జానారెడ్డిని ఓడించాలంటే టికెట్ నాకు ఇవ్వాల్సిందే’
సాక్షి, నల్గొండ : గులాబీ పార్టీలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా తమ ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఇందులో భాగంగా కొందరు పార్టీని వీడుతుండగా మరికొందరు బీఫామ్‌లు ఇచ్చేంత వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి నేత ఎంసీ కోటిరెడ్డి.. నాగార్జున సాగర్ అభ్యర్థి నోముల నరసింహయ్యకు వ్యతిరేకంగా త్రిపురారంలో సోమవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా... నోముల.. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆయనకు ఇక్కడి గ్రామ రాజకీయాల మీద అవగాహన లేదని కోటిరెడ్డి వ్యాఖ్యానించారు. జానారెడ్డిలాంటి బలమైన అభ్యర్థిని ఓడించాలంటే.. టీఆర్ఎస్ స్థానిక నేతకు(తనకు) టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఇక్కడి అభ్యర్థిని మార్చాలని, నియోజకవర్గ ప్రజల తరపున మరోసారి అధిష్టానాన్ని కోరతానని ఆయన ప్రకటించారు. అయినా బీఫామ్ ఇచ్చే చివరి నిమిషం వరకు నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా జరగని పక్షంలో అందరితో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని కోటిరెడ్డి స్పష్టం చేశారు. -
ఎస్టీఎస్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం(ఎస్టీఎస్) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని అవర్ టంపనీస్ హబ్‌లో బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికిపైగా స్థానిక తెలుగు క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 140 మంది పురుషులు, 60 మంది మహిళలు, 50 మంది బాలబాలికలు ఉన్నారు. రెండు రోజులపాటూ నిర్వహించిన ఈ టోర్నమెంట్లో వివిధ విభాగాలు కలిపి 320 మ్యాచ్‌లు నిర్వహించి విజేతలను ప్రకటించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో క్రీడలు మన శక్తిని కొత్తపుంతలు తొక్కిస్తాయని, మనోరంజక సాధనాలుగా ఉంటాయన్నారు. స్థానిక తెలుగువారి క్రీడాస్పూర్తిని ప్రశంసించారు. పోటీల అనంతరం స్పాన్సర్స్‌తో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఇంతమంది తెలుగువారు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల కార్యక్రమ నిర్వహణాధికారి మల్లిక్ పాలెపు హర్షం వ్యక్తం చేశారు. స్పాన్సర్స్‌కు, వాలంటీర్స్‌కు, కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు. -
స్నేహితుల మధ్య కొట్లాట.. యువకుడి మృతి
బాపట్ల(గుంటూరు): ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల తులసీనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో కోపోద్రిక్తుడైన ఓ యువకుడు కోటిరెడ్డి పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కోటిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో ఓ రైతు బలవన్మరణం చెందాడు. గ్రామానికి చెందిన కోటిరెడ్డి(42) మంగళవారం సాయంత్రం పొలానికని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగిరాలేదు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులు వెళ్లిచూడగా పొలంలో పురుగు మందుతాగి చనిపోయి ఉన్నాడు. అప్పులు తీర్చలేని మనోవేదనతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గంలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని.. ఈ తీరును జీర్జించుకోలేక ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు టీయూడబ్ల్యూ జే నేతలు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, దేవుల పల్లి అమర్ బషీర్ బాగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు సోమాజీ గూడలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయిస్తూ.. 1995లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని.. యూనియన్ వారసత్వంగా ఉన్న ప్రెస్ క్లబ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీయూడబ్ల్యూ జేకి అనుబంధంగానే కొనసాగాల్సి ఉంటుందని అన్నారు. కార్యవర్గంలోని కొందరు వ్యక్తులు జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చట్టబద్దంగా ప్రెస్ క్లబ్ కు సంక్రమించిన అధికారాలను కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్‌క్లబ్ పాలకమండలి పదవీకాలం ముగియగా, స్వర్ణోత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 50 సంవత్సరాలు ప్రెస్‌క్లబ్‌ను తీర్చిదిద్దిన వారిని కనీసం సంప్రదించకుండా, ప్రెస్‌క్లబ్‌కు మాతృసంస్థగా ఉన్న యూనియన్ నేతలను పరిగణలోకి తీసుకోకుండా స్వర్ణోత్సవాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 1965 మే 25న ఏర్పాటైన ప్రెస్‌క్లబ్‌కు ఆరునెలల తరువాత స్వర్ణోత్సవాలు నిర్వహించ డాన్ని తప్పుపట్టారు. ఈ సమావేశంలో ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు అమరనాథ్, ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, హెచ్‌యూజే అధ్యక్షుడు కోటిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం