బాపట్ల(గుంటూరు):
ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల తులసీనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో కోపోద్రిక్తుడైన ఓ యువకుడు కోటిరెడ్డి పై దాడి చేశాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కోటిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
స్నేహితుల మధ్య కొట్లాట.. యువకుడి మృతి
Published Sun, Feb 5 2017 1:47 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM
Advertisement
Advertisement