రెండో ప్రపంచ యుద్ధ వీరులకు నివాళి
సింగపూర్: రెండో ప్రపంచ యుద్ధ వీరులకు ఘన నివాళి అర్పించారు. ఆదివారం సింగపూర్‌లోని ప్రపంచ యుద్ధ వీర సైనికుల స్మారక స్థూపం (రాంజీ వార్ సెమిటరీ) వద్దకు చేరుకున్న పలు దేశాల నేతలు తమతమ దేశాల నుంచి యుద్ధంలో పాల్గొని వీర మరణం పొందిన సైనికులకు ఘన నివాళి అర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
నివాళి అర్పించినవారిలో భారత్, జపాన్‌తోపాటు ఇతర ఎనిమిది దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ఈ యుద్ధం సమయంలో మొత్తం 1,30,000మంది బ్రిటన్ తరుపున సైనికులు పాల్గొనగా వారిలో 67వేలమంది భారత్‌కు చెందిన సైనికులు ఉన్నారు. వీరంతా వీర మరణం పొందారు. కాగా, ఈ సందర్భంగా ప్రపంచ వర్థిల్లాలని పేర్కొంటూ పలు శాంతి సంకేతాలతో కూడా వస్తువులను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.