Krishi Kalyan cess
-
మూడు జిల్లాల్లో ‘కృషి కళ్యాణ్’
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, అనుబంధరంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగిన సబ్సిడీలు ఇస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్రం ఈ నెల ఒకటో తేదీ నుంచి కృషి కళ్యాణ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 111 జిల్లాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమురం భీం జిల్లాల్లో అమలు చేయనుంది. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఆ 3 జిల్లాల్లో 75 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. జూన్ మొదటి తేదీ నుంచి జూలై 31 వరకు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ గ్రామాల్లో ప్రణాళిక అమలు చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. భూసార కార్డుల పంపిణీ.. ఈ పథకంలో భాగంగా గ్రామంలో పూర్తిగా భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేస్తారు. పప్పులు, నూనెగింజలకు సంబంధించి రైతులందరికీ మినీకిట్స్ ఇస్తారు. రైతు కుటుంబంలోని ఐదుగురికి ఉద్యాన, వెదురు మొక్కలను పంపిణీ చేస్తారు. పశువులకు వచ్చే బోవైన్ వ్యాధి వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం ఇస్తారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి విజ్ఞాన కేంద్రాలతో రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటివి కృషి కళ్యాణ్ అభియాన్ పథకంలో ఉన్నాయి. యంత్రాల కొనుగోలుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తాయి. మొత్తం సబ్సిడీ రూ.2.5 కోట్లు మించరాని కేంద్రం స్పష్టం చేసింది. -
ఇక లగ్జరీలన్నీ మరింత ప్రియం
రూ. 10 లక్షల కన్నా ఖరీదైన కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీరు కారు ధర కంటే ఒక శాతం అదనపు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. 2016-17 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై లగ్జరీ పన్నును జూన్ 1నుంచి విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టాక్స్ పన్నును అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ అదనపు పన్నును కారు అమ్మకం దారుడు వసూలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్ షోరూం ధరలను బట్టి ఈ పన్ను విధిస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. అదేవిధంగా లగ్జరీ పన్నుతో పాటు కృషి కల్యాణ్ సెస్ పేరిట సర్వీసు పన్నులపై అదనంగా 0.50 శాతాన్ని అదనపు పన్నును వసూలు చేయనున్నారు. దీంతో ఇకనుంచి బయట రెస్టారెంట్లలో భోజనం చేయడం, ట్రావెలింగ్, ఇన్సూరెన్స్ , ప్రాపర్టీ కొనుగోలుకు ఫోన్లు చేయడం వంటివి ప్రియం కానున్నాయి. కృషి కల్యాణ్ సెస్ పేరిట 0.50 సర్వీసు పన్నును పెంచడంతో ఇప్పడివరకూ ఉన్న సర్వీసు టాక్స్ రేటు 14.5 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. గతేడాదే ఈ సర్వీసు టాక్స్ లను ఆర్థికమంత్రి పెంచారు. 12.36 గా సర్వీసు పన్నులను 14 శాతానికి చేశారు. స్వచ్ఛ్ భారత్ పేరిట మరోమారు 0.50 శాతం పెంచారు. ఈ ఏడాది కృషి కల్యాణ్ పేరిట మరో 0.50 శాతం అదనంగా సెస్ విధించనున్నట్టు అరుణ్ జైట్లీ బడ్జెట్ లో తెలిపారు.