క్వార్టర్ ఫైనల్లో కృష్ణ రోహిత్
హైదరాబాద్: చెన్నైలో జరుగుతున్న ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు కృష్ణ రోహిత్ మూడు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అండర్-16 బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతను 6-1, 6-3తో అనంత్ (తమిళనాడు)పై గెలుపొం దాడు.
అనంతరం జరిగిన అండర్-18 సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కృష్ణ రోహిత్ 6-1, 6-2తో సత్యమారన్ (తమిళనాడు)పై విజయం సాధిం చాడు. అండర్-18 డబుల్స్‌లో హిమాన్షు మోర్ తో జతకట్టిన అతను 6-0, 6-0తో యశ్వంత్-వివేకానంద్ (కేరళ) జంటను ఓడించాడు.