Krishnalanka police station
-
నారా లోకేష్‌పై కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత నారా లోకేష్‌పై కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 341,186,269 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని లోకేష్‌పై కేసులు నమోదయ్యాయి. గురువారం విమానాశ్రయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా లోకేశ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ నేతలు గుంపులుగా అక్కడికి చేరుకుని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై, పోలీసులపై దూషణలకు దిగడంతో పాటు 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా లోకేశ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ట్రాఫిక్‌కు అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇవీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు -
రుణం పేరుతో నమ్మించి ముంచారు
కృష్ణలంక(విజయవాడ తూర్పు): ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకున్న ఓ యువ రైతుకు వ్యవసాయ రుణం పేరిట వైట్ కాలర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఓ ప్రైవేట్ బ్యాంకు(హెచ్డీఎఫ్సీ) నుంచి రుణం మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికి.. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, బీమా ఛార్జీలతోపాటు కమీషన్ల పేరుతో రూ.5 లక్షలు వసూలు చేశారు. అయితే చెప్పిన మేరకు రుణం ఇప్పించకపోగా.. కమీషన్ ఇస్తేనే పని జరుగుతుందంటూ చెప్పడంతో అనుమానించిన రైతు చివరకు డబ్బు, ఆస్తి పత్రాలు తిరిగిచ్చేయాలని అడగ్గా బెదిరింపులకు దిగారు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన ఎ.సురేష్ కుమార్ అనే యువ రైతు నందిగామ ప్రాంతంలో తనకున్న 40 ఎకరాల భూమితోపాటు కౌలుకు 80 ఎకరాలు భూములు తీసుకుని అత్యాధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అవసరమైన పెట్టుబడికోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకున్నాడు. వ్యవసాయ రుణంకోసం అతను ప్రయత్నిస్తుండగా బ్యాంక్ ప్రతినిధులమంటూ శ్రీనివాస చక్రవర్తి, వి.సుధాకర్, జి.విజయకుమార్, సత్యరెడ్డి, బి.సాయితేజ, రవి అనే వ్యక్తులు గతేడాది డిసెంబర్ 29న సంప్రదించారు. యువ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి తమ బ్యాంకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, స్పెషల్ లోన్ ప్రోగ్రాంలో భాగంగా అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామంటూ నమ్మబలికారు. దీంతో రూ.4 కోట్ల వ్యవసాయ రుణానికి సురేష్ దరఖాస్తు చేశాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ఫార్మాలిటీ పేరుతో రూ.5 లక్షలు తీసుకున్న మోసగాళ్లు ఆస్తుల పరిశీలన, హామీదారుల నుంచి సంతకాలు తీసుకోవడం తదితర కార్యక్రమాలతో కొద్దిరోజులు హడావుడి చేశారు. మూడు నెలలు దాటాక.. మీకు కోటి రూపాయల లోన్ మాత్రమే మంజూరయ్యిందని, అంతకంటే ఎక్కువ మొత్తం కావాలంటే 5 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కోటి రూపాయలే కావాలనుకుంటే తెల్లకాగితంపై సంతకం చేయాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు దీంతో అనుమానించిన సురేష్ కుమార్ లోన్ అక్కర్లేదు.. డబ్బులు, ఆస్తి పత్రాలు తిరిగిచ్చేయండని కోరాడు. లోన్ వద్దంటే కట్టిన డబ్బులో ఒక్క రూపాయి తిరిగిరాదని, ఆస్తి పత్రాలు తిరిగివ్వాలంటే రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వారు బెదిరింపులకు దిగారు. దీంతో తన దరఖాస్తు గురించి తెలుసుకునేందుకు బందరురోడ్డులోని బ్యాంకుకు వెళ్లిన సురేష్ కుమార్‌కు అగ్రికల్చర్ లోన్ విభాగం వాళ్లెవ్వరూ ఇక్కడ లేరని బ్యాంకు సిబ్బంది చెప్పారు. మోసపోయానని గ్రహించిన సురేష్ కుమార్ తనకు న్యాయం చేయాలంటూ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆగ్రహ జ్వాల
సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన ఎస్సీలు కులాన్ని అవమానించారంటూ మండిపాటుమైలవరంలో సీఎం దిష్టిబొమ్మ దహనం,పది మంది అరెస్ట్ బందరులో దళిత సంఘాల ధర్నాజిల్లాలో సీఎంపై నాలుగు ఫిర్యాదులు విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘కుల’ వ్యాఖ్యలపై ఎస్సీలు నిప్పులు చెరిగారు. కులాన్ని అవమానించేలా మాట్లాడటంపై మండిపడ్డారు. అందరినీ సమదృష్టితో చూడాల్సిన ముఖ్యమంత్రే అవమానకరంగా వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ బందరులో ధర్నా నిర్వహించారు. మైలవరంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. అవనిగడ్డలో ఇద్దరు, తిరువూరులో ఒకరు, విజయవాడ కృష్ణలంకలో మరొకరు సీఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీలను అవమానించినందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందిగా వారి ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు ఫిర్యాదులు... ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మార్పీఎస్, ఎస్సీ నాయకులు జిల్లాలో నాలుగుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు నలకుర్తి రమేషన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మాలమహానాడు నాయకుడు డి.గోవర్థన్, ఎమ్మార్పీఎస్ నాయకుడు కె.రాజేశ్వరరావు కూడా ఫిర్యాదు అందజేశారు. వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకుడు ఎం.గోపాల్, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో మాదిగ హక్కుల పోరాట సమితి నాయకుడు యు.రోజ్‌కుమార్ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పలుచోట్ల నిరసనలు బందరులో దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో దళి సంఘాల వారు సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ముందుగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ధర్నా చేశారు. పోలీసు చర్యలను కూడా ఈ సందర్భంగా వారు ఖండించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకొని ఎస్సీలను అవమానించిన సీఎంపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తమపై పోలీసులు ప్రతాపం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మైలవరంలో దిష్టిబొమ్మ దహనం మైలవరంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవ్వరూ కోరుకోరంటే ఎస్సీ కులాన్ని ఎంతగా సీఎం కించపరిచారో అర్థమవుతుందని, అంటే ఆ కులంలో ఉన్న వారు పిల్లలను కనకుండా ఆపివేయాలని డెరైక్టుగానే సీఎం చెప్పారని వారు మండిపడ్డారు. ఇటువంటి విపరీత బుద్ధి సీఎంకు ఎందుకు వచ్చిందోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేపట్టిన 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నేతల ఖండనలు... పెనమలూరు మండలంలోని కంకిపాడులో కలపాల వజ్రాలు, బాకీబాబు, జగ్గయ్యపేటలో ఎస్సీ నాయకులు, ఉయ్యూరులో ఎస్సీ నాయకులు ఎస్.సురేష్‌బాబు, దాసరి రవి తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు చర్యలను ఖండించారు. ఎక్కడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడారు. తదుపరి కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు.