విభజన మనస్తాపంతో రైతు ఆత్మహత్య
కేవీబీపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటన మ రొకరిని బలిగొంది. పిల్లల భవిష్యత్‌కు ముప్పు తప్ప దని కలత చెంది మండలంలోని మహదేవపురం లో రైతు కృష్ణయ్య(40) ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు... మహదేవపురానికి చెందిన సన్నకారు రైతు కృష్ణయ్యకు భార్య జయంతి, ఇంటర్ చదువుతున్న కూతురు వాణి, పాలిటెక్నిక్ చదువుతున్న కొడుకు ఉమాపతి ఉన్నారు. రెండెకరాల పొలంలో సరిగా పంటలు పండక, గిట్టుబాటు ధర లేక ఇప్పటికే అప్పుల్లో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయడంతో ఆవేదన చెందాడు. రెండు నెలలుగా జరుగుతున్న సమైక్య ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. ఆదివారం టీవీ చానళ్లలో ‘‘విభజన తప్పదు.. దాన్ని ఎవరూ ఆపలేరు’’ అన్న కేసీఆర్ ప్రసంగాన్ని విని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తీవ్రంగా మదనపడ్డాడు. పొలానికి నీళ్లు కట్టి వస్తానని వెళ్లి పురుగులమందు తాగాడు. తండ్రి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం ఉమాపతి పొలం వద్దకు వెళ్లి చూశాడు. అప్పటికే కృష్ణయ్య మృతిచెందాడు.
సమైక్యాంధ్ర కోసం తపిస్తూ తమ తండ్రి చనిపోయాడని, ఇక తమ చదువులు సాగేదెలా అని ఉమాపతి, వాణి ఆవేదన చెందుతున్నారు. తమకు దిక్కెవరని జయంతి విలపిస్తోంది. కాగా సమైక్యాంధ్ర కోసం ఆత్మత్యాగం చేసుకున్న కృష్ణయ్య మృతదేహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గవర కృష్ణయ్య, సర్పంచ్ భారతి, టీడీపీ మండల నాయకులు రామాంజులనాయుడు, తొట్టంబేడు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తెరణి ధనుంజయరెడ్డి, జయరాంరెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు.