KS Bhagwan
-
BGT 2023: ఓపెనర్‌గా రాహుల్.. సూర్యను కూడా ఆడిస్తారా? ఎందుకు.. అతడికి బదులు..
India Vs Australia - 1st Test: టెస్టు క్రికెట్లో ప్రతిష్టాత్మక సిరీస్‌గా భావించే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా- ఆస్ట్రేలియా సన్నద్ధమవుతున్నాయి. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9న ఈ సిరీస్ ఆరంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఇరు జట్లకు ఈ సిరీస్ మరింత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఈ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తుది జట్టులో ఎవరుంటారన్న అంశంపై తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తమ జట్టును ఎంచుకున్నారు. తాజాగా.. భారత వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ సైతం ఈ జాబితాలో చేరాడు. ఆసీస్‌తో మొదటి టెస్టుకు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ ట్వీట్ చేశాడు. గిల్ వద్దు.. ఓపెనర్‌గా భీకర ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను కాదని.. రోహిత్‌కు జోడీగా కేఎల్ రాహుల్‌కు డీకే ఓటు వేయడం గమనార్హం. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇచ్చిన దినేశ్ కార్తిక్.. కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి చూపాడు. ఇక సూర్యతో పాటు ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ అరంగేట్రం చేయడం ఖాయమని చెప్పకనే చెప్పాడు. ఇలా ఎందుకు డీకే అంటున్న ఫ్యాన్స్! అయితే, డీకే జట్టుపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఫామ్‌లో ఉన్న గిల్‌ను కాదని.. కేఎల్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడం బాగాలేదంటున్నారు. ఇక సూర్య ఇంతవరకు వన్డేల్లో కూడా పెద్దగా రాణించింది లేదని, కీలక సిరీస్‌లో అతడితో ప్రయోగాలు చేస్తే మూల్యం చెల్లించకతప్పదని అభిప్రాయపడుతున్నారు. టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదన్నది వాస్తవమని.. అయితే టెస్టుల్లో పరిస్థితి వేరే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ లేడు కాబట్టి.. రాహుల్‌ను ఐదో స్థానంలో ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. రంజీల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న కేఎస్ భరత్‌కు అవకాశం ఇవ్వడాన్ని అతడి అభిమానులు స్వాగతిస్తున్నారు. ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు దినేశ్ కార్తిక్ ఎంచుకున్న భారత జట్టు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. చదవండి: Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి' స్మిత్‌ను ఆరుసార్లు అవుట్ చేశా! అశ్విన్ పాదాలకు నమస్కరిస్తే.. వెంటనే! కోహ్లి కూడా.. My 11 for first test 😊 Kl Rohit Pujara Virat SKY Jadeja K S Bharat Ashwin Axar Shami Siraj #BGT2023 #1stTest#IndiaVsAustralia — DK (@DineshKarthik) February 8, 2023 -
ఒకే తుపాకీతో గౌరీ, కల్బుర్గి హత్య
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌ను, హేతువాది ఎంఎం కల్బుర్గిని ఒకే తుపాకీతో కాల్చి చంపినట్టు తేలింది. కర్ణాటక రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ గౌరీ హత్య కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు నివేదిక అందజేసింది. కల్బుర్గి 2015 ఆగస్టు 30న ధార్వాడ్‌లోని తన ఇంట్లోనే హత్య చేశారు. గౌరి కిందటేడాది సెప్టెంబర్ 5న తన నివాసానికి సమీపంలో దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల తేడాతో వీరిద్దరినీ ఒకే తుపాకీతో చంపారని సిట్ గతంలో చెప్పినా ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతో వీరిని చంపినట్టు నివేదిక పేర్కొంది. గౌరీ లంకేశ్ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే బెంగళూరులోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు తొలి చార్జిషీట్ సమర్పించింది. అందులో హిందుత్వ కార్యకర్త నవీన్ కుమార్‌ను నిందితుడిగా సిట్ పేర్కొంది. అందులో ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ తనతో చెప్పాడని నిందితుడు నవీన్ పేర్కొన్నట్లు పొందు పరిచారు. లంకేశ్‌ను హత్య చేసేందుకు బుల్లెట్లు సిద్ధం చేయమని ప్రవీణ్ అడిగాడని నవీన్ చెప్పినట్టు పేర్కొన్నారు. మరో హత్యకు కుట్ర హేతువాది, హిందుత్వ సిద్ధాంత విమర్శకుడు కేఎస్ భగవాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నవీన్ సిట్ వద్ద అంగీకరించాడు. కిందటేడాది నవంబర్‌లో సంజయ్ బన్సారే అను వ్యక్తి తనను కలసి కేఎస్ భగవాన్ను చంపేందుకు తుపాకీలను సిద్ధం చేయమని అడిగాడని సిట్‌తో చెప్పాడు. తనకు శ్రీరామ్ సేనే, బజరంగ్‌దళ్‌తో సంబంధాలున్నా యని, 2014లో హిందూ యువసేనే అనే సంస్థను స్థాపించానని నవీన్ వెల్లడించాడు. -
'ఇప్పుడు చావు నీ వంతు.. రోజులు లెక్కపెట్టుకో'
బెంగళూరు: మరో కర్ణాటక రచయిత బెదిరింపు లేఖ వచ్చింది. ఇప్పటికే ప్రముఖ స్కాలర్ తత్వవేత్త అయిన ఎంఎం కాల్బుర్గి హత్య నుంచి అక్కడి ప్రజానీకం తేరుకోక ముందే అదే స్థాయికి చెందిన వ్యక్తి ప్రముఖ రచయిత కేఎస్ భగవాన్‌కు ఓ బెదిరింపు లేఖ అందింది. 'ఆ లేఖ వచ్చిన మధ్యాహ్న సమయంలో నేను ఇంట్లో లేను. నా కుటుంబ సభ్యులు దానిని తీసుకున్నారు. ఆంగ్లంలో ఉన్న ఆ లేఖ చదివిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇప్పుడది వారివద్దే ఉంది' భగవాన్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మైసూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భగవద్గీతను చులకన చేసే వ్యాఖ్యాలు భగవాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ వర్గం నుంచి ఆయనకు బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలిసింది. ఇంతకీ లేఖలో సారాంశం ఏమిటంటే.. 'ఇప్పటికే ముగ్గురిని హత్య చేశాం. ఇప్పుడికి నీవంతే. ఏ పోలీసులు నిన్ను రక్షించలేదు. నీ గడువు ఇప్పటికే మించిపోయింది. ఇక రోజులు లెక్కపెట్టుకో' అని తీవ్ర వ్యాఖ్యలతో ఉంది. అయితే, ఇలాంటివాటికి తాను భయపడేది లేదని, తన గురించి పూర్తిగా తెలియని వారే ఈ లేఖ రాసి ఉంటారని అన్నారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి రచనలు చేసినా దాని వెనుక ఓ పరిశోధన, అధ్యయనం ఉందని చెప్పారు.