రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో సహారాగ్రూప్ తొలుత చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అప్పటివరకూ గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ దేశం విడిచి వెళ్లలేరని పేర్కొంది. ఈ మేరకు ఇంతక్రితం (జనవరి 9) ఇచ్చిన ఆదేశాలను సడలించాలని కోరుతూ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్ను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.
ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పకపోతే ఈ విషయం దర్యాప్తునకు తాము తదుపరి ఆదేశాలను జారీ చేస్తామని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేసు విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 11కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పటికల్లా అన్ని అంశాలనూ సెబీకి సమర్పించాలని స్పష్టం చేసింది.