ksrm stadium
-
క్రికెట్ మ్యాచ్‌లకు అంతరాయం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న అండర్–19 ఎలైట్ గ్రూపు క్రికెట్ పోటీలకు వర్షం అంతరాయం కలిగించింది. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌లను మధ్యాహ్నం తర్వాత ప్రారంబించారు. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో సాయంత్రం 4.05 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. 92 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన గుంటూరు జట్టు 36 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. జట్టులోని నోవా 39, ప్రణీత్ 29 పరుగులు చేయగా మహీప్ 72 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. అనంతపురం బౌలర్లు గిరినాథ్, ముదాసిర్, సాంబశివా తలా ఒక వికెట్ తీశారు. దీంతో మూడోరోజు మ్యాచ్ ముగిసింది. కొనసాగుతున్నకడప బ్యాటింగ్.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కడప–విశాఖ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. 20 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కడప జట్టు 63 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. జట్టులోని నూర్‌బాషా 52 పరుగులు చేశాడు. విశాఖ బౌలర్లు వంశీ 3, ప్రశాంత్ 1 వికెట్ తీశారు. దీంతో మూడోరోజు ఆట ముగిసింది. కాగా వర్షం తగ్గుముఖం పడితే శనివారం మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. -

ఉత్సాహంగా అండర్ 19 క్రికెట్ పోటీలు ప్రారంభం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రీడామైదానాల్లో బుధవారం అంతర్ జిల్లాల అండర్–19 ఎలైట్ గ్రూపు క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఈనెల 27 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో వివిధ జిల్లాల జట్లు తలపడనున్నాయి. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో అనంతపురం, గుంటూరు జట్ల తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 381 పరుగుల భారీస్కోరు చేసింది. జట్టులోని మహబూబ్‌పీరా 1 సిక్స్‌ర్, 14 ఫోర్లతో 109 పరుగులు చేశాడు. ఈయనకు జతగా గిరినాథరెడ్డి 81, షకీర్ 46, ఖాదర్‌వల్లి 44 పరుగులు చేశారు. గుంటూరు బౌలర్లు సీహెచ్ మణికంఠస్వామి 2, మహీప్‌కుమార్ 2, హుస్సేన్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలిరోజు ఆటముగిసింది. కడపపై విశాఖ జట్టు ఆధిక్యం.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో విశాఖపట్టణం, కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన విశాఖ జట్టు 38.2 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని శరణ్‌తేజ 34, వంశీకష్ణ 23 పరుగులు చేశారు. కడప బౌలర్లు భరద్వాజ్ 3, హరిశంకర్‌రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 34 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని సాయిసుధీర్ 31, నూర్‌బాషా 11 పరుగులు చేశారు. విశాఖ బౌలర్లు ప్రశాంత్ 2, అజయ్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన విశాఖ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది. జట్టులోని జోగేష్ 20, శరణ్‌తేజ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసింది.