కేటీఆర్కు రాఖీ కట్టిన కవిత
హైదరాబాద్: శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగ వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండగ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కె.కవిత తన సోదరుడు ఐటీ మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టారు. ఈ రోజు ఉదయమే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. అనంతరం సోదరుడు కేటీఆర్ చేతికి రాఖీ కట్టి.. స్వీట్ అందించారు. ఈ వేడుకల్లో కేటీఆర్ కుటుంబ సభ్యులతోపాటు కవిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మాకుమారిస్ కూడా కేటీఆర్ కి రాఖీ కట్టారు.
అలాగే ఈ పండగను పురస్కరించుకుని రాజ్భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు ఈ వేడుకల్లో గవర్నర్ దంపతులు.. నగర వాసులు పాల్గొనున్నారు.