జాకీచాన్‌కు గౌరవ ఆస్కార్
యాక్షన్ మూవీ హీరో, రచయిత, దర్శకుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు అయిన జాకీచాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ సినిమాకు ఆయన చేస్తున్న సేవలకు, ఆయన సాధించిన విజయాలకు గాను గౌరవ ఆస్కార్‌ను అందించాలని ఆస్కార్ జ్యూరీ నిర్ణయించింది. జాకీతో పాటు ఎడిటర్ అన్నేకోట్స్, కాస్టింగ్ డైరెక్టర్ లెన్ స్టేల్మాస్టర్, డాక్యుమెంటరీ దర్శకుడు ఫ్రెడ్రిక్ వైజ్మన్లను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
నవంబర్‌లో జరగనున్న ఆస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ నలుగురికి అవార్డు ప్రధానం జరుగనుంది. ప్రస్తుతం జాకీచాన్ ఇండో చైనీస్ సినిమాగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సోనూసూద్, దిశాపటాని లాంటి భారతీయ నటీనటులు కూడా నటిస్తుండగా, పలువును ఇండియన్ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.