ఓపెన్ నాలాలో పడి ఒకరు మృతి
కూకట్పల్లి: కూకట్పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్ ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందిరా గాంధీ బస్తీకి చెందిన కురుమయ్య(40) క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడి మృతి చెందాడు. అయితే అతను అనారోగ్యంతో ఉన్నాడని, ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. కాగా, అధికారుల నిర్లక్ష్యంతోనే తమ వ్యక్తి చనిపోయాడని ఆరోపిస్తూ మృతదేహంతో అతని బంధువులు ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.