kunchanapalli
-
తాడేపల్లి నుంచి రైతుల భారీ ర్యాలీ
సాక్షి, అమరావతి : ఓ వైపు రైతుల పొట్ట కొడుతూ... మరోవైపు పరిశ్రమల పేరుతో అస్మదీయులకు విలువైన భూములను కారుచౌకగా కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై వైఖరిపై రైతన్నలు భగ్గుమంటున్నారు. సన్న, చిన్నకారు రైతుల పొట్టకొట్టి భూములను బడా నేతలకు కేటాయించాలని చూస్తోందంటూ మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ పలు గ్రామాల రైతులు సోమవారం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లి, కుంచెనపల్లి, కొలనుకొండ గ్రామాల్లోని భూములపై ప్రభుత్వం విధించిన U-1 రిజర్వ్ జోన్ తొలగించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన కంపెనీకి దాదాపు 7 ఎకరాల భూమి కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి భార్య వెంకాయమ్మ డైరెక్టర్‌గా ఉన్న గుంటూరు టక్స్‌టైల్ పార్క్ లిమిటెడ్‌కు గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం గోపాలవారిపాలెంలో 6.96 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు నివాసం వరకూ రైతుల ర్యాలీ
-
రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి సమీపంలో శుక్రవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... కృష్ణా పుష్కరాల సమీపిస్తున్న నేపథ్యంలో రహదారి పనులు ఊపందుకున్నాయి. ఆ క్రమంలో రహదారి నిర్మాణం కోసం కాంక్రీట్ మిక్చర్ లోడ్‌తో అధిక వేగంతో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో కాంక్రీట్ లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు గుంటూరుకు చెందిన భాస్కరరావు అని పోలీసులు తెలిపారు.