సాక్షి, అమరావతి : ఓ వైపు రైతుల పొట్ట కొడుతూ... మరోవైపు పరిశ్రమల పేరుతో అస్మదీయులకు విలువైన భూములను కారుచౌకగా కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై వైఖరిపై రైతన్నలు భగ్గుమంటున్నారు. సన్న, చిన్నకారు రైతుల పొట్టకొట్టి భూములను బడా నేతలకు కేటాయించాలని చూస్తోందంటూ మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ పలు గ్రామాల రైతులు సోమవారం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లి, కుంచెనపల్లి, కొలనుకొండ గ్రామాల్లోని భూములపై ప్రభుత్వం విధించిన U-1 రిజర్వ్ జోన్ తొలగించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కాగా కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన కంపెనీకి దాదాపు 7 ఎకరాల భూమి కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి భార్య వెంకాయమ్మ డైరెక్టర్‌గా ఉన్న గుంటూరు టక్స్‌టైల్ పార్క్ లిమిటెడ్‌కు గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం గోపాలవారిపాలెంలో 6.96 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment