పిడుగుపడి భారీ అగ్ని ప్రమాదం
గుమ్మలక్ష్మీపురం: పిడుగుపాటుతో ప్రారంభమైన మంటలకు ఓ గ్రామంలోని 56 ఇళ్లు కాలిపోయాయి. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొండవలస పంచాయతీ పరిధిలోని కురాసింగ్ గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జి.తెలుంగు అనే వ్యక్తికి చెందిన పశువుల పాకపై పిడుగుపడింది.
దాంతో మంటలు ప్రారంభమై భారీగా విస్తరించాయి. 56 ఇళ్లు పాక్షికంగా, రెండిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. 40మేకలు, రెండు ఎడ్లు మృత్యువాతపడ్డాయి. 40 సెల్ఫోన్లు కూడా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.