చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాతకు జైలు
నరసరావుపేట(గుంటూరు): చెల్లని చెక్కు కేసులో నల్లగొండకు చెందిన సినీ నిర్మాతకు ఏడాది జైలు, రూ.2.10 లక్షల జరిమానా విధిస్తూ మొదటి అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కె.వి.రామకృష్ణయ్య బుధవారం తీర్పు చెప్పారు. సేకరించిన సమాచారం మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన కట్టా వెంకటరమణ వద్ద సినీ నిర్మాత గజనీ నాగభూషణం 2008లో కిరోసిన్ డీలర్షిప్ ఇప్పిస్తానని చెప్పి రూ.15లక్షలు తీసుకున్నారు.
డీలర్షిప్ రాకపోవటంతో వెంకటరమణ డబ్బులు అడగ్గా 2011లో రూ.15లక్షలకు భూషణం చెక్కు ఇచ్చారు. దీనిని సంబంధిత బ్యాంకులో జమ చేయగా అకౌంట్లో నగదు లేకపోవటంతో బౌన్స్ అయింది. దీనిపై భూషణానికి తెలియజేసినా అతడి నుంచి స్బందనలేకపోవటంతో కోర్టులో కేసు వేశారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిర్మాతకు పై శిక్ష, జరిమానా విధించారు.