labour family
-
గోడ కూలి 15 మంది మృతి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పుణేలో శుక్రవారం అర్థరాత్రి ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పుణేలోని కోండవా ప్రాంతంలో ప్రహరీ గోడ కూలి 15 మంది దుర్మరణం చెందారు. భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు గాను అల్కాన్ ల్యాండ్‌మార్క్స్, కంచన్ రాయల్ ఎక్సోటికా ప్రాజెక్టు సంస్థలు భారీగా తవ్వకాలు చేపట్టాయి. ఈ పనుల్లో పాల్గొంటున్న బిహార్‌లోని కటిహార్ ప్రాంతానికి చెందిన కూలీలు దాదాపు 20 మంది అక్కడే గుడిసెలు వేసుకుని కుటుంబాలతోపాటు ఉంటున్నారు. ఆ పక్కనే దాదాపు 22 అడుగుల ఎత్తైన ప్రహరీ ఉంది. శుక్రవారం నాటి భారీ వర్షానికి ప్రహరీ బాగా నాని, అర్థరాత్రి సమయంలో కూలీల గుడిసెలపై కూలి పడింది. గోడతోపాటుఅవతలి వైపు పార్కు చేసిన పదుల సంఖ్యలో కార్లు కూడా వారిపై పడిపోయాయి. దీంతో వాటికింద నలిగి 15 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోగా ముగ్గురు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. వారిలో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఏడేళ్లలోపు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కాగా, అల్కాన్ ల్యాండ్‌మార్క్స్, కంచన్ రాయల్ ఎక్సోటికా ప్రాజెక్టు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రహరీ వరకు తవ్వకాలు చేపట్టడం వల్లనే ఈ ఘటన జరిగిందని మున్సిపల్ కమిషనర్ సౌరభ్‌రావు తెలిపారు. అల్కాన్ ల్యాండ్‌మార్క్స్, కంచన్ రాయల్ ఎక్సోటికా ప్రాజెక్టు సంస్థలకు చెందిన 8మందిపై ఐపీసీ–304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, బిహార్ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించాయి. ఈ విషయమై మంత్రి తానాజీ సావంత్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షలు, శివసేన పార్టీ తరఫున రూ.లక్ష కలిపి మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ దుర్ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వారంలోగా నివేదిక అందజేయాలని కోరారు. ఘటన ప్రాంతంలో భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని పుణే మేయర్ ఆదేశించారు. -
బహరేన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆర్థిక సాయం..
బహరేన్: బహరేన్ లో ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన మార్కంటి బాబు(34) కుటుంబానికి బహరేన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ విభాగం, తోటి కార్మికులు రూ. 120,309 ఆర్ధిక సాయం అందించారు. తెలంగాణ కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోలంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు బతుకు దెరువు కోసం బహరేన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ప్రయివేట్ కంపేనీలో విధులు నిర్వహిస్తూ గత నెల ఆగష్టు 8న ప్రమాదవశాత్తు మరణించాడు. అతడి పార్దీవ దేహాన్ని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో ఆగష్టు 23న స్వగ్రామానికి పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బాబు మరణంతో ఆకుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబానికి అండగా బహరేన్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్, తోటి కార్మికులు, రూ. 120,309 చెక్‌ను పంపించి ఆర్ధిక సాయం చేశారు. సాయం చేసిన వారిలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీ డా రవి, సెక్రెటరీలు రవిపటేల్ దెషెట్టి, సుమన్ అన్నారం, గంగాధర్ గుమ్ముల, సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, సుధాకర్ ఆకుల, నర్సయ్య, Ch రాజేందర్, వినోద్, సాయన్న, వసంత్ తదితరులున్నారు. -
ఇంటి దీపం ఆరింది.. కష్టమే మిగిలింది!
ఎక్కడ చావుకేక వినిపించినా.. రోదనలు మాత్రం పాలమూరువే. ఎక్కడ ఏ ఘోరం జరిగినా ఉలిక్కిపాటుకు గురయ్యేది ఇక్కడివారే..! పొట్టకూటి కోసం వెళ్లినవారు ఎక్కడో ఓ చోట చనిపోతున్నారు. లేదంటే తమ పిల్లలను కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఊపిరాడక ఇద్దరు వలసకూలీలు చనిపోయారు. మ్యాన్‌హోల్ శుభ్రం చేసేందుకు వెళ్లి వీరస్వామి, కోటయ్య మృతి ఆపన్నహస్తం కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపు రెక్కాడితే డొక్కాడని బతుకులు వారివి. ఎవుసం చేద్దామంటే సెంటు భూమి లేదు. ఊరిలో ఉపాధి లేక.. బతుకుదారి చూపేవారు లేక పొట్టచేతపట్టుకుని పట్నం పోయిన ఆ కుటుంబాలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయాయి. ఈనెల 1వ తేదీన హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసే క్రమంలో వెళ్లిన వలసకూలీలు చాకలికోటయ్య, వీరస్వామి చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఏ దిక్కూలేక వారి భార్యాపిల్లలు రోడ్డునపడ్డారు. నాగర్‌కర్నూల్ మండలం ఉయ్యలవాడ గ్రామానికి చెందిన కోటయ్య(35) గ్రామంలో సెంటు భూమి కూడా లేదు. తన భార్య మంగమ్మతోపాటు ఇద్దరు కూతుళ్లు, కొడుకును తీసుకొని ఆరేళ్లక్రితం హైదరాబాద్‌కు వలసవెళ్లారు. అక్కడే రాంకోటి ప్రాంతంలో ఉన్న ఆర్కే ఎస్టేట్ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు కల్పనను 9వ తరగతి, అఖిల 6వ తరగతి, వంశీ 6వ తరగతి చదివిస్తున్నాడు. భార్య ఇళ్లల్లో పనులకు వెళ్తూ, తానూ అప్పుడప్పుడు అడ్డాకూలీగా పనులకు వెళ్లేవాడు. ఈక్రమంలో మే డే రోజున మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో పనికి వెళ్లాడు. మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువుకు గురై చనిపోయాడు. ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడింది. తన కూతుళ్లను కస్తూర్బా స్కూల్లో, కొడుకును ఏదైనా రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించాలని మంగమ్మ వేడుకుంటోంది. వీరస్వామి కుటుంబం కన్నీటిగాథ మరో వలసకూలీది అదే కన్నీటి వ్యథ.. పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన బోయ బొందయ్య, బాలకిష్టమ్మ పెద్దకొడుకు వీరస్వామి(33) బతుకుదెరువు కోసం 20ఏళ్ల క్రితం హైదారాబాద్‌కు వలసవెళ్లాడు. ప్రస్తుతం రాంకోటి ప్రాంతంలో చిన్నపాటి గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. భార్య భాగ్యలక్ష్మితో కలిసి అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 1వ తేదీన డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన వీరస్వామి విషవాయులతో ఊపిరాడక చనిపోయాడు. అతడికి ఇద్దరు కొడుకులు లాలు, శివ ఉన్నారు. వీరస్వామికి గ్రామంలో సొంతిళ్లు కూడా లేదు. కేవలం బేస్మెంట్ వరకే నిర్మించి వదిలివేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ సుల్తానమ్మ, ఎంపీటీసీలు ఎల్లమ్మ, మాధవి కోరారు. వీరస్వామి అంత్యక్రియలు సోమవారం రాత్రి స్వగ్రామంలోనే నిర్వహించారు. -
నాన్నా.. అని పిలువు బిడ్డా!
గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు పూణె నుంచి దామరగిద్ద తండాకు చేరిన చిన్నారులు వైష్ణవి, విరాట్ మృతదేహాలు ఎక్కడ చావుకేక వినిపించినా.. రోదనలు మాత్రం పాలమూరువే. ఎక్కడ ఏ ఘోరం జరిగినా ఉలిక్కిపాటుకు గురయ్యేది ఇక్కడివారే..! పొట్టకూటి కోసం వెళ్లినవారు ఎక్కడో ఓ చోట చనిపోతున్నారు. లేదంటే తమ పిల్లలను కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఊపిరాడక ఇద్దరు వలసకూలీలు చనిపోయారు. పూణేలో పిల్లర్ గుంతలోపడి ప్రాణాలొదిన ఇద్దరు పసిహృదయాల మరణవేదన ఇలాంటి ఉదంతాలకు సజీవసాక్ష్యమే..! దామరగిద్ద : ‘నాన్నా.. అని ఒక్కసారి పిలువు బిడ్డా.. మీ అమ్మను చూడు! తమ్ముడిని కాపాడబోయి చనిపోయవా.. తల్లీ!’ అంటూ విగతజీవులుగా మారిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వలస పనులకు తల్లిదండ్రులు మహారాష్ట్రలోని పూణేకు వెంట తీసుకెళ్లిన తమ ఇద్దరు పిల్లలు పిల్లర్ గోతిలోపడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. చిన్నారులు వైష్ణవి(5), విరాట్(4) మృతదేహాలను దామరగిద్ద తండాకు తీసుకొచ్చారు. అక్క, తమ్ముడి మృతదేహాలను చూసి ప్రతిఒక్కరూ చలించిపోయారు. తండాకు చెందిన శాంతాబాయ్, కిష్టానాయక్ దంపతులు నెలరోజుల క్రితం బతుకుదెరువుకోసం పూణెకు వలసవెళ్లారు. తమతోపాటు ఇద్దరు పిల్లలకు వెంట తీసుకెళ్లారు. సోమవారం భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమై పిల్లలను అక్కడే వదిలిపెట్టారు. అక్కడే ఆడుకుంటున్న అక్కాతమ్ముళ్లు వైష్ణవి, విరాట్ భవన నిర్మాణం కోసం తవ్విన పిల్లర్‌గుంతలో పడిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నించిన వైష్ణవి కూడా నీళ్లలోనే ప్రాణాలు విడిచింది. ‘ చిన్నారుల తల్లిదండ్రులు శాంతాబాయ్, కిష్టానాయక్ ఆవేదనను చూసిన ప్రతిఒక్కరూ చలించిపోయారు.