
బహరేన్: బహరేన్ లో ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన మార్కంటి బాబు(34) కుటుంబానికి బహరేన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ విభాగం, తోటి కార్మికులు రూ. 120,309 ఆర్ధిక సాయం అందించారు. తెలంగాణ కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోలంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు బతుకు దెరువు కోసం బహరేన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ప్రయివేట్ కంపేనీలో విధులు నిర్వహిస్తూ గత నెల ఆగష్టు 8న ప్రమాదవశాత్తు మరణించాడు.
అతడి పార్దీవ దేహాన్ని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో ఆగష్టు 23న స్వగ్రామానికి పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బాబు మరణంతో ఆకుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబానికి అండగా బహరేన్ టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్, తోటి కార్మికులు, రూ. 120,309 చెక్‌ను పంపించి ఆర్ధిక సాయం చేశారు.
సాయం చేసిన వారిలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీ డా రవి, సెక్రెటరీలు రవిపటేల్ దెషెట్టి, సుమన్ అన్నారం, గంగాధర్ గుమ్ముల, సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, సుధాకర్ ఆకుల, నర్సయ్య, Ch రాజేందర్, వినోద్, సాయన్న, వసంత్ తదితరులున్నారు.