bahrain TRS Cell
-
బహరేన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆర్థిక సాయం..
బహరేన్: బహరేన్ లో ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన మార్కంటి బాబు(34) కుటుంబానికి బహరేన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ విభాగం, తోటి కార్మికులు రూ. 120,309 ఆర్ధిక సాయం అందించారు. తెలంగాణ కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోలంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు బతుకు దెరువు కోసం బహరేన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ప్రయివేట్ కంపేనీలో విధులు నిర్వహిస్తూ గత నెల ఆగష్టు 8న ప్రమాదవశాత్తు మరణించాడు. అతడి పార్దీవ దేహాన్ని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో ఆగష్టు 23న స్వగ్రామానికి పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బాబు మరణంతో ఆకుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబానికి అండగా బహరేన్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్, తోటి కార్మికులు, రూ. 120,309 చెక్‌ను పంపించి ఆర్ధిక సాయం చేశారు. సాయం చేసిన వారిలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీ డా రవి, సెక్రెటరీలు రవిపటేల్ దెషెట్టి, సుమన్ అన్నారం, గంగాధర్ గుమ్ముల, సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, సుధాకర్ ఆకుల, నర్సయ్య, Ch రాజేందర్, వినోద్, సాయన్న, వసంత్ తదితరులున్నారు. -
బహ్రెయిన్‌లో జయశంకర్ సార్ జయంతి వేడుకలు
తెలంగాణా జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి 83వ జయంతి వేడుకలను బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నేతలు జయశంకర్ సారుకు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని అనంతరం ఆండాల్స్ గార్డెన్ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మూడో విడత హరితహారం తెలంగాణకు మణిహారంగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో దీనిని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు బహ్రెయిన్‌లో హరితహారం చేపట్టారు. బహ్రెయిన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ మహోన్నతమైన వ్యక్తి అని సార్ సేవలను కొనియాడారు. ప్రతీ సామాజిక అంశంపై సార్ పరిశీలన చాలా గొప్పగా ఉండేదని.. ఆయన చేసిన భావజాల వ్యాప్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. జయశంకర్ సార్ పిలుపుతో ఊరూరా కేసీఆర్ లాంటి నేతలు తయారై ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేసుకున్నారు. సార్ జయంతి వేడుకలను గల్ఫ్ దేశాల్లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవిపటేల్ దెశెట్టి, జాయింట్ సెక్రెటరీలు సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ప్రమోద్ బోలిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.