labour suicides
-
కార్మికుడు ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలో సాయినగర్ 3వక్రాస్ నేతాజీపార్క్ వద్ద నివాసముంటున్న టైల్స్ కార్మికుడు జాన్‌డేవిడ్ (24) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ కాసేపటికే మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కూలీ ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన వెంకటరమణ (38) అనే కూలీ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ మహమ్మద్ రఫి తెలిపిన మేరకు.. వెంకటరమణ తాడిపత్రి ప్రాంతానికి వెళ్లి కొంతకాలంగా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతోపాటు ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టడంతో అతడు తాగుడుకు బానిసయ్యాడు. మహాశివరాత్రి సందర్భంగా బసంపల్లిలోని మేనమామ ఇంటికి వచ్చాడు. ఆరోగ్యం బాధిస్తుండటంతో మనస్తాపానికి గురైన వెంకటరమణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం పురుగుమందు తాగాడు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి అతడిని ధర్మవరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వెంకటరమణకు భార్య వాసవితో పాటు కుమారుడు ఉన్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కార్మికుడి ఆత్మహత్య
ఎడ్లపాడు: కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో విశ్వతేజ స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన గణేశ్వరరావు (35) అనే వ్యక్తి స్పిన్నింగు మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే, కుటుంబ కలహాల వల్ల జీవితంపై విరక్తి చెందిన అతడు ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎడ్లపాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మికుడి ఆత్మహత్య
కరీంనగర్ (సిరిసిల్ల): అప్పులబాధ భరించలేక కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన కోడం శ్రీకాంత్ (28) అనే యువ కార్మికుడు ఆదివారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్స్టైల్ పార్క్‌లో శ్రీకాంత్ సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మూడునెలల క్రితం టెక్స్టైల్ పార్క్ నుంచి సిరిసిల్లకు వచ్చేందుకు బైక్ లిఫ్ట్ అడిగి వస్తుండగా, రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించాడు. శ్రీకాంత్ తీవ్రంగా గాయపడి కాలు విరిగిపోయింది. వైద్యం కోసం అప్పు చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉంటూ పనికి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ఉపాధి కరువై అప్పులు పెరిగిపోయాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. అతడి భార్య అర్చన కూడా ఇటీవల అనారోగ్యం బారిన పడింది. అప్పులబాధలు, పని లేక మంచానికే పరిమితం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీకాంత్ ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శ్రీకాంత్‌కు భార్య అర్చన, కుమారుడు సాకేత్ (2) ఉన్నారు.