చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన వెంకటరమణ (38) అనే కూలీ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మహమ్మద్ రఫి తెలిపిన మేరకు.. వెంకటరమణ తాడిపత్రి ప్రాంతానికి వెళ్లి కొంతకాలంగా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతోపాటు ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టడంతో అతడు తాగుడుకు బానిసయ్యాడు. మహాశివరాత్రి సందర్భంగా బసంపల్లిలోని మేనమామ ఇంటికి వచ్చాడు.
ఆరోగ్యం బాధిస్తుండటంతో మనస్తాపానికి గురైన వెంకటరమణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం పురుగుమందు తాగాడు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి అతడిని ధర్మవరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వెంకటరమణకు భార్య వాసవితో పాటు కుమారుడు ఉన్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కూలీ ఆత్మహత్య
Published Wed, Mar 1 2017 9:36 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
Advertisement
Advertisement