Lack of leadership
-
సునీత.. మరో రబ్డీ అయ్యేనా...?!
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనైంది. చాన్నాళ్లుగా ఊహిస్తున్నదే అయినా, ఆప్‌లో నాయకత్వ లేమిని ఈ పరిణామం బట్టబయలు చేసింది. మద్యం కేసులోని ఇతర నిందితుల్లా కేజ్రీవాల్ కూడా దీర్ఘకాలం పాటు జైలుకే పరిమితమైతే ఆప్ పరిస్థితేమిటన్న ప్రశ్నకు బదులుగా ఆయన భార్య సునీత పేరు తెరపైకి వస్తోంది. భర్త స్థానంలో ఆప్ పగ్గాలతో పాటు ఢిల్లీ సీఎం బాధ్యతలనూ ఆమె చేపట్టవచ్చంటూ ఊహాగానాలు విని్పస్తున్నాయి. సోషల్ మీడియాలో అందుకు అనుకూల, వ్యతిరేక వాదనలు జోరుగా సాగుతున్నాయి... 1997లో నాటి బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలుపాలు కావడంతో భార్య రబ్డీదేవిని ముఖ్యమంత్రిని చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అచ్చం అలాగే సునీత కూడా రాజకీయ అరంగేట్రం చేయవచ్చంటూ ఊహాగానాలు విని్పస్తున్నాయి. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ శనివారం ప్రజలనుద్దేశించి పంపిన వీడియో సందేశాన్ని పార్టీ నేతలకు బదులు సునీత చదివి విని్పంచడం ఇందుకు సంకేతమంటూ జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ సందర్భంగా ఆమె కేజ్రీవాల్ కురీ్చలో కూర్చోవడం యాదృచ్చికమేమీ కాదని కూడా అంటున్నారు. అరవింద్, సునీత ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులే. శిక్షణ సందర్భంగా ఏర్పడ్డ సాన్నిహిత్యం పెళ్లికి దారితీసింది. ముందుగా కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేసి హక్కుల కార్యకర్తగా మారారు. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టారు. ఆయన సీఎం అయ్యాక సునీత కూడా ఐఆర్ఎస్కు రాజీనామా చేశారు. అప్పుడప్పుడు భర్తతో పాటు పార్టీ ప్రచారంలో పాల్గొనడం, ఆప్ ఎన్నికల విజయాలపై స్పందించడం తప్ప రాజకీయంగా చురుగ్గా ఉన్నది లేదు. పారీ్టలో కూడా ఆమె ఎలాంటి పదవిలోనూ లేరు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సందేశాన్ని ఆప్ నేతలు కాకుండా సునీత చదివి విని్పంచడం ఒక్కసారిగా ఊహాగానాలకు తావిచ్చింది. వాటిపై మిశ్రమ స్పందనలూ వస్తున్నాయి. ‘‘సునీతకు పగ్గాలప్పగిస్తే సానుభూతి కూడా ఆప్‌కు కలిసొస్తుంది. కష్టకాలం నుంచి పార్టీని ఆమె బయట పడేస్తారు. కీలకమైన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ లోటును కూడా భర్తీ చేస్తారు’’ అని కొందరంటున్నారు. భర్త తరఫున ఆయన సందేశాన్ని విని్పంచినంత మాత్రాన రాజకీయాల్లోకి వస్తారని అనుకోలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఆమె కూర్చున్నది సీఎం కుర్చీ ఏమీ కాదు. తమ నివాసంలో కేజ్రీవాల్ మీడియాతో భేటీ అయ్యే కురీ్చలో కూర్చున్నారంతే. దాన్ని అధికార మార్పిడికి సంకేతంగా చూడటం సరికాదు’’ అన్నది వారి వాదన. సునీత రాజకీయ ఎంట్రీ వార్తలపై ఆప్ మౌనం వహిస్తోంది. ఆప్ నేతల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాత్రమే దీనిపై పెదవి విప్పారు. ఆయన కూడా ఈ విషయమై తనకెలాంటి సమాచారమూ లేదని చెప్పడంతోనే సరిపెట్టారు. బీజేపీ మాత్రం అప్పుడే ముందస్తు విమర్శలతో హోరెత్తిస్తోంది. ఆప్ నాయకత్వ రేసులో చివరికి కేజ్రీవాల్ భార్య కూడా చేరారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ గతంలో చేసిన వాగ్దానాలను వరుసబెట్టి తుంగలో తొక్కుతుంటే సునీత ఎక్కడున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నడిపించే నాయకుడేడీ...!!
వరంగల్ ఉపఎన్నికల ఫలితాలతో తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయి కుదేలైంది. ఈ ఫలితం కాంగ్రెస్‌లో తీవ్ర నిరాశా నిస్పృహలను నింపింది. పార్టీని నడిపించడానికి సరైన నాయకుడు లేనందువల్లే ఉపఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఉపఎన్నిక విషయంలో అంతా ఒక్కటై పని చేయాల్సిన పరిస్థితుల్లో కూడా టీ-పీసీసీ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం, టికెట్ ఖరారు చేసే విషయంలో కూడా సమన్వయం లేకపోవడం వంటి అనేక అంతర్గత సమస్యలు ఈ పరిస్థితిని తెచ్చాయని చెబుతున్నారు. వీటికి తోడు టీఆర్ఎస్ విషయంలో తమ అంచనాలు కూడా తారుమారయ్యాయని అంటున్నారు. అధికారం చేపట్టిన 17 నెలల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావించిన కాంగ్రెస్ నేతలకు.. ఓరుగల్లు ప్రజల తీర్పు పెద్ద షాకిచ్చింది. గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు కూడా సాధించుకోలేక చతికిలపడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్ వంటి జాతీయ నేతలను రప్పించి ప్రచారం చేయించినా డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి రావడం ఆ పార్టీ నేతలను అంతర్మథనంలో పడేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం అంటూ సవాలు చేశారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు, చిట్టచివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం లాంటి అనేక కారణాలు ఈ పరిస్థితికి కారణమయ్యాయని నేతలు తాజాగా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న తమ అంచనా తప్పిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి స్వల్పకాలమే అయినందున ఆ ప్రభుత్వం పట్ల ప్రజలింకా నమ్మకంతో ఉన్నారని ఈ ఫలితాలతో తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. మొదట్లో స్థానిక కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల వానీగా సమావేశాలు నిర్వహించి శ్రేణుల్లో కొంత కదలిక తెచ్చారు. రాజయ్య ఎఫెక్ట్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలుకు చిట్టచివరి రోజున కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక.. తన ముగ్గురు పిల్లలతో కలిసి అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ విషయంలో రాజయ్య, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు కావడం లాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. సర్వే సత్యనారాయణతో అప్పటికప్పుడు నామినేషన్ వేయించారు. సరైన సమన్వయం చేసేవారు లేకపోవడంతో సర్వేకు ఘోర పరాజయం తప్పలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2,69,065 ఓట్లు రాగా ఈసారి 1,55,957 ఓట్లు మాత్రమే రావడం, గతంతో పోల్చితే లక్షకు పైగా ఓట్లు తగ్గడం కాంగ్రెస్ నేతలను నివ్వెరపరిచింది. -
నడిపించే నాథుడేడి?
-
నడిపించే నాథుడేడి?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికి వారే.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య తలనొప్పిగా మారింది. ఈ ప్రాంతంలో పార్టీని ఏకతాటిపైన నడిపే నాయకుడే కరువయ్యాడు. మరోపక్క టీ కాంగ్రెస్ సీనియర్ నేతల్లోనూ సమన్వయం కొరవడింది. పార్టీ నేతలను ఏకతాటిపైన నడి పించాల్సిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో మునిగిపోగా... పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే నాథుడు లేకుండా పోయారు. మరోవైపు పొన్నాల నాయకత్వాన్ని సీనియర్లెవరూ గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యనేత, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్ష పదవి తమకే వస్తుందని చివరి వరకు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, కె.ఆర్.సురేష్‌రెడ్డి, వి.హనుమంతరావు, జె.గీతారెడ్డి, అలాగే మరో కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ, జీవన్‌రెడ్డి తదితరులు పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రచార సారథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేరు మొదటి నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి భంగపడటంతో ఆయనా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అలాగే మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య గత కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న పార్టీ సమీక్షలకు వారు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి? ఏయే కార్యక్రమాలు చేపట్టాలి? విపక్షాల విమర్శలను ఎండగట్టేందుకు ఏం చేయాలి? కేసీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహమేంటి? అనే విషయంలోనూ వారు పొన్నాలకు సహకరించడం లేదు. ఇటీవల పొన్నాల సీనియర్ నేతల ఇళ్లకు వెళ్లి సహకరించాలని కోరినా... ఆచరణలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సీమాంధ్రతీరే వేరు... ఒకవైపు సీమాంధ్రలో పార్టీ నాయకుల వలసలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తున్నా...ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి తదితరులంతా ఒక్కటై ‘బస్ యాత్ర’ పేరుతో జనంలోకి వెళుతున్నారు. విపక్షాల విమర్శలను ఎండగడుతూ తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ విషయానికొస్తే అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. సీమాంధ్రను పణంగా పెట్టి విభజనపై నిర్ణయం తీసుకున్నా...ఆ క్రెడిట్‌ను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఖాతాలో వేయలేని దుస్థితిలో టీ కాంగ్రెస్ నేతలున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారనే భావన తెలంగాణ ప్రజల్లో ఉన్నప్పటికీ, ఆ సానుభూతిని ఓట్ల రూపంలోకి మార్చుకునే కార్యాచరణ కొరవడింది. ఒకవైపు తెలంగాణ చాంపియన్‌ను తానేనంటూ కేసీఆర్ దూకుడుగా ప్రజలను పూర్తిస్థాయిలో తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంటే... కాంగ్రెస్ నేతలు మాత్రం తమ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఎడారిలో చుక్క నీటి కోసం నానా పాట్లు పడినట్లుగా సీమాంధ్రలో ఒక్క సీటు గెలిచే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించకపోయినా పార్టీ నేతలంతా ఒకే తాటిపైకి వచ్చి జనంలోకి వెళుతుంటే.....తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉందని తెలిసినా దానిని అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఉండటం గమనార్హం. సోనియాకు కృతజ్ఞతలు చెప్పుకోలేని దుస్థితి! సోనియాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే చివరకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక్క బహిరంగ సభ కూడా పెట్టుకోలేని దుస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నెలరోజులు దాటినా ఈరోజుకూ భారీ బహిరంగ సభ దిశగా అడుగులు వేయకపోవడం గమనార్హం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఢిల్లీలో సమావేశమై వారం రోజుల్లో హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చే సి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెబుతామని ముక్తకంఠంతో ప్రకటించారు. అదే విధంగా తెలంగాణలోని నాలుగు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు చెబుతామని మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే నెలరోజులు గడుస్తున్నా కనీసం ఒక్క సభను కూడా నిర్వహించలేకపోయారు. సభలు ఎప్పుడు పెట్టాలో తేదీలు కూడా ఖరారు చేయులేకపోయూరు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా సీనియర్లు టీపీసీసీ అధ్యక్ష నియామకాన్ని చేపట్టకముందు వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లిన జానారెడ్డి కూడా ఇప్పుడు తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలు, పార్టీ నేతల్లోఉన్న రాజకీయ విబేధాలు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలపై రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్‌కు పూర్తి అవగాహన ఉంది. మొన్నటి వరకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు హైకమాండ్ పెద్దలకు వివరిస్తూ....అక్కడి నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి ఈ ప్రాంత నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు. టీపీసీసీ అధ్యక్ష పగ్గాలను పొన్నాల లక్ష్మయ్యకు అప్పగించడంతో కీలక బాధ్యతల విషయంలో హైకమాండ్ పెద్దలు తనను పక్కనపెట్టారని భావించిన డీఎస్ కూడా తనకెందుకులే అని కినుక వహిస్తున్నారు. దీనికితోడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను సంప్రదించలేదనే అసంతృప్తి కూడా డీఎస్‌లో నెలకొంది. సీనియర్ నేతలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. దీనివల్ల తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం నెలకొంది. తెలంగాణ వచ్చిందనే సంతోషం ఉన్నా...ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు గట్టి నాయకత్వం కరువైందని వాపోతున్నారు.