lady voters
-
తాయిలాల రాగం ఓటర్లకు గాలం
ఓట్ల బాటలో ఆశావహులు ముందస్తుగా కురుస్తున్న హామీల వర్షం గంపగుత్తగా నజరానాలు యువతకు క్రికెట్ కిట్లు గృహిణులకు బీరువాలు మహిళా సంఘాలకు ఫర్నిచర్ చోటామోటా నాయకులకు పదవుల పందేరాలు ఎంపీగా గెలిపిస్తే సదా మీ సేవలోనే..అంటూ ప్రచారం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల వేళ ‘ఆశావహులు’ ఓటరుకు గాలం వేసే పనిలో పడ్డారు. జెండాలు మోసే కార్యకర్తలను.. ఎన్నికలను ప్రభావితం చేయగల యువతను.. గెలుపు ఓటముల్లో కీలకమయ్యే మహిళలను ప్రసన్నం చేసుకోవడంలో బిజీ అయ్యారు. అధికారం చేతిలో ఉన్న నేతలు కోట్లాది రూపాయల విలువచేసే అభివృద్ధి పనులు తెచ్చి అరచేతిలో ప్రజలకు వైకుంఠం చూపిస్తున్నారు. మెట్రో రైల్ కోసం కృషి చేస్తానంటూ ఓ నేత హామీ ఇస్తే... కాల్వలు లేకున్నా పంట పొలాలకు నీళ్లు ఇచ్చి తీరతామని మరో నేత.. ‘ప్రాణహిత’తో ప్రాణం పోస్తానని ఇంకో నాయకుడు.. ఇలా ప్రజలను మొహమాటపెడుతుంటే..! అధికారం చేతిలో లేని ఓ నాయకుడు మాత్రం తన ట్రస్టునే నమ్ముకున్నారు. గత ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోయిన సదరు నేత క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లతో యువతకు, జంఖానాలు, డ్వాక్రా కార్యాలయాలకు బీరువాలు, టేబుళ్లతో మహిళా ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను మరణించిన తర్వాత తన కుమారుడు సైతం సేవలను కొనసాగిస్తారని పూర్తి భరోసా ఇస్తుం డటం గమనార్హం. మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన సదరు నాయకుడు తనతో కలిసి వచ్చే చోటా మోటా నాయకులకు పార్టీలో వివిధ పదవులను కట్టబెట్టించి తన చుట్టూ తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జెండాలు మోసే కార్యకర్తలకు కోరితే కొండ మీద కోతిని కూడా తెచ్చి ఇచ్చేందుకు ఆకాశానికి నిచ్చెన వేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను పోటీ చేస్తున్న మెదక్ నియోజకవర్గంలోని వెల్దుర్తి, జిన్నారం మండలాలకు సదరు నేత గత రెండు రోజుల కిందట గంపగుత్తగా నజరానాలు ఇచ్చారు. మహిళా గ్రామైక్య సంఘం కార్యాలయానికి బీరువా, కార్పెట్, టేబుల్ చొప్పున మొత్తం 64 నాలుగు సంఘాలకు ఇచ్చారు. యువత కోసం ప్రతి గ్రామంలో రెండు క్రికెట్ కిట్లు, రెండు వాలీబాల్ కిట్లు, క్యారం బోర్డు, సాధారణ ఓటరు మహాశయునికి రాత్రి వేళ వెలుగులు అందించడం కోసం ప్రతి గ్రామానికి కనీసం 10 చొప్పున మెర్క్యురీ వీధి దీపాలు ఇచ్చేశారు. తాను పల్లెకు వచ్చినప్పుడు డప్పు సప్పుళ్లతో ఊరేగించేందుకు 10 డప్పులు సైతం పంపిణీ చేశారు. జోరుగా హామీలు.... నజరానాలు ఇచ్చిన తర్వాత హామీల వర్షం గుప్పిస్తున్నారు. ‘తనను మెదక్ ఎంపీగా గెలిపిస్తే మరిన్ని సేవలు చేస్తా. పేదింటి ఆడపిల్లకు అన్నగా అండగా నిలబడతా, పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపుతా. ఏడాదికి 501 పెళ్లిళ్లు చేస్తా.. విద్యార్థులకు, గ్రామీణ క్రీడాకారులకు ఆట వస్తువులు అందిస్తా. నేను మరణించాక నా కుమారుడు ఈ సేవలు అందిస్తారు’ అంటూ ఓ నేత హామీలు కురిపిస్తున్నారు. సదరు నేత మాటలకు ఆకర్షితులై ఓ గ్రామ సర్పంచ్, 200 మంది కార్యకర్తలు అప్పటికప్పుడు పార్టీలో చేరిపోయారు. బోణి కుదిరింది కానీ ‘ఇల్లు అలకగానే పండుగ కాదు’ అని క్రికెట్ కిట్లకు, బీరువాలకు ఓట్లు రాలవని ఆయన ప్రత్యర్థులు అనుకోవడం గమనార్హం. -
వనితా ప్రకాశం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయిగా నిలిచింది. తాజాగా విడుదలైన ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 24 లక్షల 9 వేల 217 మంది ఓటర్లుండగా, వారిలో పురుషులు 11 లక్షల 99 వేల 58 మంది, మహిళలు 12 లక్షల 10 వేల 25 మంది ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్లు 10,967 మంది అధికంగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మహిళల పల్లకిని మోయాల్సిన పరిస్థితి నెలకొంది. 30-39 మధ్య వారే ఎక్కువ... స్త్రీ, పురుష ఓటర్లలో 30 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్లే అధికం. 30-39 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లు 6 లక్షల 38 వేల 738 మంది ఉన్నారు. 18-19 సంవత్సరాల మధ్య ఉండి కొత్తగా ఓటుహక్కు పొందినవారు 55,682 మంది ఉన్నారు. ఒకవైపు మహిళలకు జేజేలు కొడుతూ, ఇంకోవైపు ఈ రెండు వయసుల కేటగిరీలను దగ్గరకు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పార్టీల పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా వయస్సుల వారీగా చూసుకుంటే ఈ వయసు ఓటర్లే అధికంగా ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్న వారికి దగ్గరగా వెళితే అనుకూల ఫలితాలు వస్తాయన్న భావన కూడా రాజకీయ పార్టీల్లో నెలకొంది. -
35,39,011 ఇదీ జిల్లా ఓటర్ల సంఖ్య
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది జాబితా ప్రకటన జిల్లాలో మహిళా ఓటర్లే అధికం పురుష ఓటర్ల సంఖ్య : 17,46,901 మహిళా ఓటర్ల సంఖ్య : 17,91,806 ఇతరులు : 304 మంది పెరిగిన ఓటర్లు : 1,15,015 మంది జనాభాలో ఓటర్ల నిష్పత్తి : 70.3 శాతం సాక్షి, గుంటూరు జిల్లాలో ఓటర్ల తుది జాబితా విడుదలైంది. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ జాబితా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 35,39,011 మంది ఓటర్లు వున్నారు. వీరిలో 17,41,907 పురుష ఓటర్లు కాగా, 17,89,834 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఓట్లకు మిలటరీ ఉద్యోగుల ( సర్వీసు ఎలక్టర్స్) ఓట్లు కలిపి మొత్తం 35,39,011 మందితో ఓటర్ల తుది జాబితాను శుక్రవారం సాయంత్రం జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. పురుష, మహిళా ఓటర్ల నిష్పత్తి 1000:1028గా ఉంది. అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,028 మంది మహిళలు ఉన్నట్లు తేలింది. గత ఏడాది నవంబరు 18న ప్రకటించిన డ్రాఫ్ట్ ఓటర్ల సంఖ్యతో పోలిస్తే తుది జాబితాలో 1,15,015 మంది పెరిగారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో 34,23,996 మంది ఓటర్లున్నారు. అంటే 3.16 శాతం మేర ఓటర్లు పెరిగారు.జనాభాలో ఓటర్ల నిష్పత్తి (ఈపీ రేషియో) 70.3 శాతంగా ఉంది. మిలటరీ ఉద్యోగుల ఓటర్లు జిల్లాలో 6,966 వున్నారు. వీరిలో పురుషులు 4,994 కాగా, మహిళలు 1,972 మంది వున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఓటర్లు అధికం.. జిల్లాలోకెల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 2,43,918 మంది ఓటర్లు ఉంటే, సర్వీసు ఓటర్లు 244 మంది ఉన్నారు. మొత్తం కలిపి 2,44,162 మంది ఓటర్లున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లు గుంటూరు పశ్చిమ,తూర్పు నియోజకవర్గాల్లో అధికంగా నమోదయ్యారు. ఓటర్ల సంఖ్యలో గుంటూరు పశ్చిమ తరువాతి స్థానాల్లో గురజాల, మాచర్ల, తెనాలి నియోజకవర్గాలు ఉన్నాయి. అత్యల్పంగా ఓటర్లు బాపట్ల నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ 1,66,520 మంది వున్నారు.ఇదిలావుంటే, తుది జాబితా ప్రకటన తర్వాత కూడా నిరంతర ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెబుతున్నా, ఇకపై జరిగే చేర్పులకు ఎన్నికల జాబితాలో చోటు దక్కే అవకాశం ఉండదు. నగరంలో 4,59,435 మంది ఓటర్లు అరండల్‌పేట : నగరంలో మొత్తం 4,59,435 మంది ఓటర్లు ఉన్నట్లు నగర కమిషనర్ కె వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ప్రకటించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో 2,15,517 మంది ఉండగా వీరిలో 106735 మంది పురుషులు, 108764 మంది స్త్రీలు, 18 మంది ఇతరులు ఉన్నారనీ, పశ్చిమ నియోజకవర్గంలో 2,43,918 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1.20.715 మంది పురుషులు, 1,23,159 మంది స్త్రీలు, 44 మంది ఇతరులు ఉన్నారనీ తెలిపారు. ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం కార్పొరేషన్ కార్యాలయం, తహశీల్దారు, ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో 39,935 మంది కొత్తగా ఓటు హక్కును పొందారని చెప్పారు. గత నవంబర్ 18నాటికి న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 2,21,586 మంది ఓటర్లు ఉండగా తాజాగా 2,43,918 మంది ఉన్నారనీ, ఇక్కడ కొత్తగా 22,332 మంది చేరారు. వీరిలో 11,542 మంది స్త్రీలు, 10,760 మంది పురుషులు, ఇతరులు 30 మంది ఉన్నారన్నారు. తూర్పు నియోజకవర్గం లో 1,97,914 మంది ఓటర్లు ఉండగా తాజాగా 2,15,517 మంది ఉన్నారన్నారు. ఇక్కడ 17,603 మంది కొత్తగా ఓటుహక్కు పొందారనీ, వీరిలో 9,138 మంది స్త్రీలు, 8,449 మంది పురుషులు, 16 మంది ఇతరులు ఉన్నారని వివరించారు.