lakes overflow
-
చెరువుల్లో జల సవ్వడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన రెండు నెలలుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రికార్డు స్థాయిలో చెరువులు నిండుతున్నాయి. ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా మత్తడి దూకుతున్నాయి. ఇప్పటికే 13వేలకు పైగా చెరువులు పొంగిపొర్లుతుండగా, మరో 17వేల చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. మరిన్ని రోజులు వర్షాల ప్రభావం ఉండటంతో మిగతా చెరువులు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. గోదావరి బేసిన్Sచెరువులన్నీ జల సవ్వడిని సంతరించుకున్నాయి. బేసిన్లో మొత్తం 20,111 చెరువులుండగా 6,630 అలుగుపారుతున్నాయి. మరో 10,900 చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 2,669, వరంగల్ జిల్లాలో 1,259 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఉన్న మరో 5 వేలకు పైగా చెరువులు పూర్తిగా నిండి ఉండగా, ఏ క్షణమైనా మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో 3,800, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 2వేల చెరువుల చొప్పున పూర్తిగా నిండాయి. ఇక కృష్ణా బేసిన్ లో 23,301 చెరువులకు గానూ 6,500 ఉప్పొంగుతుండగా, మరో 5,900 చెరువులు వంద శాతం నిండి ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 3,390 చెరువులు అలుగుపారుతుండగా, మెదక్ జిల్లా పరిధిలో 1,700, నల్లగొండ జిల్లాలో 1,110, రంగారెడ్డి జిల్లాలో 210 చెరువులు అలుగు దూకుతున్నాయి. మొత్తంగా రెండు బేసిన్ లలో 43,412 చెరువుల్లో 13 వేలకు పైగా చెరువులు అలుగుపారుతుండగా, నిండుకుండలుగా మరో 17వేల వరకు ఉన్నాయి. ఇక 50 శాతానికి పైగా నిండినవి 4,490 చెరువులున్నాయి. మొత్తంగా చెరువుల కింద 22 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, ఈ వానాకాలంలోనే 20 లక్షల ఎకరాలకు నీరందుతోంది. మిషన్ కాకతీయ అమల్లోకి వచ్చిన తర్వాత చెరువుల కింద 51 శాతం ఆయకట్టు పెరగ్గా, ఎండిపోయిన 17 శాతం బోర్లు మళ్లీ నీటిని పోస్తున్నాయి. చెరువులు నిండిన ఫలితంగా వచ్చే యాసంగి సీజన్ లో వీటి కింది ఆయకట్టుకు ఢోకా ఉండదని, సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుందని జల వనరుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, చెరువుల కట్టలు తెగడం.. బుంగలు పడటం ఇతర నష్టాలు సంభవించడం వంటివి ఈ ఏడాది తక్కువేనని అధికారులు తెలిపారు. -
వామ్మో వర్షం
-
వర్షం దండీ
పొంగిపొర్లిన చెరువులు, కుంటలు జిల్లా అంతటా 30 మి.మీ. వర్షపాతం నమోదు సిద్దిపేట, నర్సాపూర్ లో దెబ్బతిన్న ఇళ్లు నారింజ వాగులోకి భారీగా వరదనీరు సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో గురువారం మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. వర్షం ధాటికి సిద్దిపేట, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. జిల్లా అంతటా 30 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదైంది. న్యాల్కల్ మండలంలో అత్యధికంగా 78 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాయికోడ్, మనూరు, ములుగు మండలాల్లో 60 మి.మీ, జహీరాబాద్, అందోలు, చిన్నకోడూరు, పుల్కల్ మండలాల్లో 40 నుంచి 50 మి.మీ. వర్షం కురిసింది. సిద్దిపేట పట్టణంలో భారీగా వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఒక ఇల్లు కూలిపోయింది. నంగనూరు మండలంలో వర్షం కారణంగా 27 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సిద్దిపేట మండలంలో 122 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చిన్నకోడూరులో భారీగావర్షం కురవటంతో చెరువుల, కుంటలు, చెక్డ్యాంలలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. నర్సాపూర్ నియోజకవర్గంలో భారీగా వర్షం కురవటంతో చెరువులు, కుంటలు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. నర్సాపూర్ మండలంలో పాక్షికంగా 25 ఇళ్లు దెబ్బతినగా వెల్దుర్తి మండలంలో 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గజ్వేల్ నగర పంచాయతీలో రెండు ఇళ్లు దెబ్బతినగా లోతట్టు ప్రాంతాల్లోని శివాలయం వీధి, సిరి ఎన్క్లేవ్ ప్రాంతంలో ఇళ్లులోకి వర్షం నీళ్లు వచ్చాయి. గజ్వేల్ మండలంలో రెండు ఇళ్లు కూలాయి. కొండపాక మండలంలో వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట, నారాయణఖేడ్, మెదక్ నియోజకవర్గాల్లో వర్షం కురిసింది. వర్షంతో ఆయా నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. జహీరాబాద్ సమీపంలోని నారింజగవాగులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నారింజవాగు పొంగి పొర్లుతోంది. వర్షంతో జహీరాబాద్ మండలంలో ఏడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.