ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్ : పేకాట స్ధావరంపై దాడి చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ. 11వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలోని ఓ ఇంట్లో సోమవారం సాయంత్ర చోటుచేసుకుంది.