కూర్గ్‌లో రొమాన్స్
నాగశౌర్య, ‘ఉయ్యాల జంపాల’ ఫేం అవికా గోరే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. నంద్యాల రవి దర్శకుడు. గిరిధర్ మామిడిపల్లి నిర్మాత. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమ, కుటుంబ బంధాల మేళవింపు ఈ సినిమా. ఇటీవలే హీరోహీరోయిన్లపై కూర్గ్‌లోని అందమైన పరిసరాల్లో ఓ మెలొడీ పాటను చిత్రీకరిచాం. కేఎం రాధాకృష్ణన్ స్వరపరిచిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. అలాగే ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు కూడా అక్కడే షూట్ చేశాం. ఈ నెల 31 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలుపెడతాం’’ అని చెప్పారు.