అగ్నిప్రమాదంలో వృద్ధురాలి మృతి
చిలమత్తూరు: మండలంలోని మరవకొత్తపల్లిలో లక్ష్మీనరసమ్మ(73) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించినట్లు ఎస్ఐ జమాల్బాషా తెలిపారు. శుక్రవారం రాత్రి ఇంట్లో విద్యుత్ లేకపోవడంతో దీపాన్ని వెలిగించి తల వద్ద పెట్టుకుని నిద్రపోయిందన్నారు. ప్రమాదవశాత్తు దీపం నుంచి మంటలు వ్యాపించి ఆమె తల, శరీరం కాలిపోయిందన్నారు. వెంటనే హిందూపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.