Land scandals
-
ఫేస్బుక్ నా పరువు తీస్తోంది: దమ్మాలపాటి పిటిషన్
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో హైకోర్టును ఆశ్రయించి ఏసీబీ దర్యాప్తుపై స్టేతో పాటు మీడియా కథనాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ పొందిన మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించిన వివరాలతో పోస్టింగ్‌లు వస్తూనే ఉన్నాయని, వాటిని ‘విశ్వవ్యాప్తం’గా తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తనపైన, తన కుటుంబసభ్యులు, సన్నిహితులపైన ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఏసీబీ ఎఫ్ఐఆర్కు సంబంధించిన కథనాలను వ్యాప్తిచేస్తూ దురుద్దేశపూర్వక ‘మీడియా ట్రయిల్’ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తును, నిందితుల హక్కులను ప్రభావితం చేసేలా మీడియా ట్రయిల్ ఉండరాదని మనుశర్మ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందంటూ ప్రస్తావించారు. (ఏసీబీ దర్యాప్తు మొదలు పెట్టకుండానే దమ్మాలపాటి హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చారు). సోషల్ మీడియా కథనాలతో తన పరువు ప్రతిష్టలకు నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ అనుబంధ వ్యాజ్యంపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. (తమిళ పత్రిక కథనం: చంద్రబాబూ.. ఎందుకీ కడుపుమంట..?) మేం ఆదేశాలిచ్చినా.. దమ్మాలపాటి న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు విన్న అనంతరం.. తాము ఆదేశాలిచ్చినా సోషల్ మీడియాలో పోస్టులెలా వస్తాయని జస్టిస్ మహేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ పోస్టుల తొలగింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ చెప్పారు. దమ్మాలపాటి ఫేస్‌బుక్‌ను ప్రతివాదిగా చేర్చకుండానే ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తర్వులు కోరుతున్నారన్నారు. తమ ఉత్తర్వుల అమలుకు కేంద్రానికి ఆదేశాలిస్తామని సీజే పేర్కొన్నారు. మరిన్ని వివరాల సమర్పణకు గడువు కావాలన్న ప్రణతి వినతికి సీజే అంగీకరించారు. (రోజువారీ విచారణకు బాబు అక్రమాస్తుల కేసు) మీ ఎస్ఎల్పీ ఎంతవరకు వచ్చింది? హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ ఎంతవరకు వచ్చిందని సీజే ఆరా తీశారు. వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని సుమన్ చెప్పారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సీజే ఇచ్చిన మీడియా గ్యాగ్ ఉత్తర్వులను సవరించాలని కోరుతూ న్యాయవాది మమతారాణి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పైన విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. దమ్మాలపాటి కౌంటర్ తమకు అందలేదని మమతారాణి న్యాయవాది పి.బి.సురేశ్ చెప్పడంతో «కౌంటర్ కాపీని వారికి ఇవ్వాలని ప్రణతికి సీజే సూచించారు. -
‘ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదు’
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఒక్క గజం కూడా దోపిడీకి గురికాలేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ భూకబ్జా జరగకుండా రూ.400 కోట్ల విలువైన భూములను కాపాడామని పేర్కొన్నారు. ‘‘టీడీపీ నేతలు ఐదేళ్లలో భూకబ్జాలు, దోపిడీలకు పాల్పడ్డారు. విశాఖ పరిపాలన రాజధాని కాకుండా చంద్రబాబు ఎన్ని కుట్రల చేసినా ఆగదని’’ మంత్రి అవంతి స్పష్టం చేశారు. బీచ్‌రోడ్డులో ట్రామ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని అవంతి పేర్కొన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు రాబోతుందని, మెట్రో రైలుతో విశాఖ రూపురేఖలు మారనున్నాయని ఆయన వెల్లడించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అన్ని కుంభకోణాలేనని, తమది అవినీతి రహిత పాలన అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
విశాఖ భూ కుంభకోణాలపై సిట్ విచారణ షురూ
సాక్షి, విశాఖపట్టణం : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలను విచారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ శుక్రవారం నుంచి తన విచారణను ప్రారంభించింది. విచారణ బృందానికి మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వం వహిస్తుండగా, మాజీ ఐఏఎస్ అధికారిణి అనూరాధ, రిటైర్డ్ జడ్జి భాస్కరరావు సభ్యులుగా ఉన్నారు. అక్టోబరు 26న సిట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్ వద్ద బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స్వీకరణకు పదమూడు బృందాలను నియమించగా, ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు సహాయకులు ఉంటారు. బాధితులు వివరాలను సిట్ రూపొందించిన నిర్ణీత ఫార్మాట్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఫార్మాట్‌తో పాటు ఆధారాలను సిట్ ఏర్పాటు చేసిన టేబుల్ వద్ద అందజేయాలి. బాధితులకు సహాయంగా ఆరు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. 13 మండలాలకు ఒకటి చొప్పున 13 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారు దరఖాస్తుతో పాటు భూమికి సంబంధించిన దస్తావేజుల జిరాక్స్ కాపీలను జతచేయాలి. ఒరిజినల్స్ సైతం తీసుకెళ్లి, అధికారులకు చూపించాలి. నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడని వారికోసం ప్రత్యేకంగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలోనే కాకుండా దేశ, విదేశాల్లో ఉండే ఎన్నారైల కోసం vizagcollectorate.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరించనున్నారు. బాధితుల అనుమానాల నివృత్తికి 1800-42500002, 0891-2590100 నంబర్లను ఏర్పాటు చేశారు. -
‘అధికార పార్టీ కుంభకోణాలపై విచారణ చేపట్టాలి’
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు భూ కుంభ కోణాలకు పాల్పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం విచారణ చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రం కర్నూలులోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా రాజధానికి శంకుస్థాపన పేరిట హంగమా చేస్తున్నారని విమర్శించారు.