కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు భూ కుంభ కోణాలకు పాల్పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం విచారణ చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రం కర్నూలులోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా రాజధానికి శంకుస్థాపన పేరిట హంగమా చేస్తున్నారని విమర్శించారు.
‘అధికార పార్టీ కుంభకోణాలపై విచారణ చేపట్టాలి’
Published Sun, Oct 18 2015 10:05 PM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement
Advertisement