ఎక్కువ సౌండ్‌తో వినికిడి లోపం!!
టొరంటో: సంగీతాన్ని సౌండ్ ఎక్కువగా పెట్టుకుని వింటే టీనేజ్ పిల్లలు శాశ్వతంగా వినికిడి లోపం వచ్చే అవకాశముందని పరిశోధకులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. చెవిలో హోరుగా అనిపించే(టినిటస్)పై చేసిన పరిశోధనల్లో ఈ అంశం వెలుగుచూసిందని కెనడా యూనివర్సిటీ పరిశోధకుడు ల్యారీ రాబర్ట్స్ చెప్పారు. పార్టీల్లో, క్లబ్బుల్లో సౌండ్ ఎక్కువగా పెట్టుకుని వినే విద్యార్థులపై ఈ అధ్యయనం చేశారు. వీరి చెవుల్లో బజ్మంటూ హోరు వినిపిస్తుందని తేలినట్లు పరిశోధకులు చె ప్పారు.