Latest survey
-
అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్.. హారిస్‌తో ఉత్కంఠ పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పది రోజులే మిగిలి ఉంది. పోలింగ్ తేదీ నవంబర్ 5 దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరిగింది. పోల్స్ ఫలితాలు కూడా తారుమారవుతున్నాయి. అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకొన్న మొదట్లో వరుస పోల్స్ హారిస్ వైపే మొగ్గు చూపాయి. కానీ తీరా పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి క్రమంగా తారుమారు అవుతున్నట్టు కన్పిస్తోంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలోకి వెళ్తున్నారు. అంతేగాక తాజా పోల్స్‌లో సానుకూలతను పెంచుకున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ట్రంప్, హారిస్ పోరు తారాస్థాయికి చేరుతోంది. మొన్నటిదాకా సర్వేల్లో హారిస్ ఆధిక్యంలో ఉండగా తాజాగా ట్రంప్ కాస్త ముందంజలోకి వచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వేలో ట్రంప్ 47 శాతం మద్దతు దక్కించుకోగా హారిస్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. సీఎన్‌బీసీ ఆల్ అమెరికన్ ఎకనమిక్ సర్వేలోనూ హారిస్ కంటే ట్రంప్ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హోరాహోరీ పోరు సాగుతున్న 7 కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనూ తాజా సర్వేల్లో హారిస్ కంటే ట్రంప్ ఒక్క పాయింట్ ఆధిక్యం సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటలైన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాతో పాటు నల్లజాతీయులు, లాటినో ఓటర్లలో ఆయన పట్టు సాధిస్తున్నారు.ఇది డెమొక్రాట్లకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ప్రధాన పోల్స్ అన్నింటినీ విశ్లేషించే రియల్క్లియర్పాలిటిక్స్ ప్రకారం హారిస్ ఇప్పటికీ ట్రంప్‌పై 0.3 శాతం ఆధిక్యంలో ఉన్నారు. కాకపోతే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్‌కే 0.9 శాతం మొగ్గుందని అది తేల్చింది. అమెరికా బెట్టింగ్ మార్కెట్ అయితే ట్రంప్ విజయావకాశాలను ఏకంగా 61 శాతంగా అంచనా వేసింది. హారిస్ గెలిచేందుకు 39 శాతం మాత్రమే చాన్సుందని పేర్కొంది. ట్రంప్‌పై కొన్ని రోజులుగా హారిస్ తీవ్ర విమర్శలు చేస్తుండటం తెలిసిందే. హిట్లర్‌ను ప్రశంసించిన ట్రంప్ అంతకంటే నియంత అంటూ దుయ్యబట్టారు. ఆయనో అసమర్థుడని ఎద్దేవా చేశారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పర్యవసానాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ పాపులర్ ఓట్లను గెలుచుకోవచ్చని సర్వేలంటున్నాయి. కానీ కీలక రాష్ట్రాలను కైవసం చేసుకుంటేనే ఎన్నికల విజయం సాధ్యం. మరోవైపు చాలా రాష్ట్రాల్లో ఓటర్లకు హారిస్‌పై పలు అంశాల్లో ఇప్పటికీ అభ్యంతరాలున్నాయి. మరోవైపు ముందస్తు ఓటేసిన అమెరికన్ల సంఖ్య 3.1 కోట్లు దాటింది.పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైనది పెన్సిల్వేనియా. వాటిలో అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజీ ఓటు్లున్న రాష్ట్రం. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకటనలపైనే రెండు పార్టీలు కోట్లు వెచ్చించాయి. ఇక్కడి ఓటర్లు ఆర్థిక వ్యవస్థపై చాలా ఆందోళన చెందుతున్నారు. వారు క్రమంగా ట్రంప్ వైపే మొగ్గుతున్నారు. వివాదాస్పద, కుంభకోణాల వ్యక్తిగా ట్రంప్‌పై విముఖత ఉన్నా ఆయన హయాంలో ఆహారం, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి మహిళలు మాత్రం హారిస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన దారుణం. ఆయన్ను మరోసారి వైట్‌హౌస్‌కు పంపించేదే లేదు’’ అంటున్నారు. కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ కూతురు లిజ్ షెనీ వంటివారి ప్రచారం కూడా హారిస్‌కు ఎంతో కొంత కలిసి రానుంది.‘అబార్షన్ హక్కులు’ ప్రభావం చూపేనా?హారిస్‌కు అమెరికావ్యాప్తంగా ఉన్న సానుకూలత మహిళా ఓటర్లలో బలమైన ఆధిక్యం. ఆమె అభ్యర్థిత్వమే చరిత్రాత్మకం. కానీ ఆమె దీనిపై ప్రచారం చేసుకోవడం లేదు. మహిళల అబార్షన్ హక్కులకు బలంగా మద్దతిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టిన అత్యంత కఠినమైన అబార్షన్ నిషేధం మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని రాజ్యాంగంలో చేర్చాలా వద్దా అనే అంశాన్ని పది రాష్ట్రాలు ఓటింగ్‌కు పెట్టాయి. అలాంటి రాష్ట్రాల్లో అరిజోనాలో హారిస్‌కు మెజారిటీ వచ్చే అవకాశముంది. అయితే అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు సృష్టించిన వాతావరణాన్ని హారిస్ బలంగా కొనసాగించలేకపోయినట్టు పోల్స్ చెబుతున్నాయి.డెమొక్రాట్లకు ‘గాజా’ షాక్ట్రంప్కే అరబ్–అమెరికన్ల జయహోకీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లో అరబ్–అమెరికన్ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. 2020లో బైడెన్ కేవలం అక్కడ 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు, ఇక్కడ అరబ్ అమెరికన్ల జనాభా 3 లక్షలు. గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ దాడులను నియంత్రించడంలో బైడెన్ విఫలమయ్యారని వారంతా భావిస్తున్నారు. ఈ ప్రభావం నేరుగా డెమొక్రాట్ల అభ్యర్థి హారిస్‌పై పడేలా ఉంది. ఉపాధ్యక్షురాలిగా హారిస్ కూడా దీనికి బాధ్యురాలేనని వారు భావిస్తున్నారు. డెమొక్రాట్ల కంటే అధిక వామపక్ష భావాలున్న వారిలోనూ ఇదే ధోరణి కనబడుతోంది. ‘‘మేమంతా ట్రంప్‌కు ఓటేస్తాం. అంతేగాక ఆయనకే ఓటేయాలని ఇతరులకూ చెబుతాం’’ అని వారంటున్నారు. ‘‘మేం ట్రంప్‌కు ఓటేస్తామని ఏడాది కిందట ఊహించను కూడా లేదు. కానీ ఇప్పుడు డెమొక్రాట్లను క్షమించలేం. హారిస్‌కు ఓటేసేది లేదు’’ అని స్పష్టంగా చెబుతున్నారు. మిషిగన్‌లో కార్మికవర్గం, యూనియన్ల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. తామెవరికీ మద్దతివ్వబోమని ఇప్పటికే కొన్ని యూనియన్లు ప్రకటించాయి. హారిస్‌పై కొన్ని అభ్యంతరాలున్నా ఆమె తప్ప ప్రత్యామ్నాయం లేదని కొందరు భావిస్తుండటం ఆమెకు కాస్త కలిసొచ్చే అంశం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా ఎటువైపు?
అమెరికాలో అందరి అభిప్రాయంగా ప్రచారంలో వున్న అంశాన్నే తాజా సర్వే కూడా మరోసారి ధ్రువీకరించింది. ఈసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నెగ్గే ఛాన్స్ లేదన్నది ఆ సర్వే సారాంశం. అమెరికాలో అత్యధికులు ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌నే కోరుకుంటు న్నారని ఆ సర్వే చెబుతోంది. అంతకన్నా ముఖ్యమైనదేమంటే... ఓటు హక్కున్న ప్రవాస భారతీ యుల్లో మూడింట రెండొంతులమంది ఈసారి బైడెన్‌కే ఓటేస్తామని తెలిపారు. ఎన్నారై ఓటర్లలో 72 శాతంమంది బైడెన్‌కు అనుకూలంగా వుంటే ట్రంప్‌కు 22 శాతంమంది అనుకూలం. సాధారణంగా భారతీయులెప్పుడూ డెమొక్రాటిక్ పార్టీకే అనుకూలంగా వుంటారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నెగ్గాలని కోరుకున్నవారిలో భారతీయులు గణనీయంగానే వున్నారన్న అభిప్రాయం కలగడానికి అప్పుడు కొంతమంది చేసిన హడావుడి, ఆయన శిబిరంలో ఎన్నికల బాధ్యతలు చూసేవారిలో గణనీయ సంఖ్యలో ఎన్నారైలు వుండటం కొంత కారణం. దాంతోపాటు అప్పట్లో ట్రంప్ కోసం కొందరు యజ్ఞం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఎన్నారై ఓట్లలో 16 శాతం ట్రంప్‌కు వెళ్లాయని లెక్కలు చెబుతున్నాయి. ఆయనపై పోటీచేసిన డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 77 శాతం ఎన్నారైలు ఓటేశారు. దీన్నిబట్టి చూస్తే ట్రంప్ ఓట్లు అప్పటికీ ఇప్పటికీ 6 శాతం మేర పెరిగాయి. మరో 6 శాతం మంది ఎటూ తేల్చుకోలేనివారున్నారని తాజా సర్వే వెల్లడించింది. వీరిలో ఎంత శాతాన్ని ట్రంప్ తనవైపు తిప్పుకుంటారన్నది చూడాల్సివుంది. పెన్సిల్వేనియా, మిచిగాన్, ఫ్లారిడా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్లు ఎక్కువగా వుంటారు. కనుక అక్కడ వీరి మద్దతు కీలకమవుతుంది. ఎన్నారై ఓటర్లలో ట్రంప్‌వైపు మొగ్గిన వారి సంఖ్య గతంకన్నా పెరగడానికి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకున్న ఆదరణ కారణం. వాస్తవానికి ఇదింకా ఎక్కువగానే వుండేది. కానీ ట్రంప్ తెంపరితనం దాన్ని తగ్గించింది. ఒకపక్క ఎన్నికలు ముంగిట్లోకొచ్చిన తరుణంలో ఈ నెల మొదటివారంలో హెచ్ 1బీ వీసాలపై కొత్త ఆంక్షలు విధించారు. అమెరికా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే వీటిని తీసుకొచ్చానని ట్రంప్ ప్రకటించారు. ఎలాంటి కారణం చూపి అయినా ప్రభుత్వం వీసా నిరా కరించడానికి ఈ నిబంధనలు వీలు కల్పిస్తున్నాయని, ఇందువల్ల తమకెంతో నష్టం జరుగుతుందని భారతీయులు వాపోతున్నారు. అయితే శ్వేత జాతి అమెరికన్లలో కూడా తన పరపతి తగ్గుతోందని తెలిశాకే ట్రంప్ ఈ కొత్త ఆంక్షల్ని అమల్లోకి తెచ్చారన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థికన్నా దాదాపు 8 నుంచి 10 శాతం అధికంగా ఓట్లు తెచ్చుకున్న అయోవా, ఒహాయో, టెక్సాస్ రాష్ట్రాల్లో ఈసారి కేవలం అయోవా రాష్ట్రంలో మాత్రమే ఆయన లబ్ధి పొందుతారని ఒక సర్వే గతంలో చెప్పింది. అయితే ఒహాయో, ఫ్లారిడాల్లో బైడెన్ వెనకబడ్డారని తాజా సమాచారం. ఈ రెండూ రెండో ప్రపంచ యుద్ధం మొదలుకొని ఇప్పటివరకూ అధ్యక్షుడిగా ఎంపికైనవారి వెనకే వున్నాయి. గత నెల 29న ట్రంప్, బైడెన్ల సంవాదం తర్వాత బైడెన్ ఆధిక్యత కనబరిచారని దాదాపు అన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. ఎన్బీసీ అయితే అంతక్రితం రెండు వారాలకన్నా బైడెన్ ఆధిక్యత ఆరు శాతం పెరిగిందని... ఆయనకు 53 శాతంమంది మద్దతు పలికితే, ట్రంప్‌కు 39 శాతంమంది అనుకూలంగా వున్నారని తేల్చింది. గత ఎన్నికల్లో తన ప్రత్యర్థికన్నా ఒక శాతం ఓట్ల ఆధిక్యత సాధించిన మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యత చాలా ఎక్కువగా వుందన్నది సర్వే చెబుతున్న మాట. ఈ మూడూ పారిశ్రామికంగా ప్రాముఖ్యం వున్నవని, ఇక్కడ కార్మికుల సంఖ్య ఎక్కువగా వుంటుందని గమనిస్తే ట్రంప్ పరిస్థితి ఎలావుందో అంచనా వేసుకోవచ్చు. ఇవన్నీ గ్రహించబట్టే ట్రంప్ ఉత్సాహంగా వున్నట్టు కనబడేందుకు ప్రయత్నిస్తున్నారు. బైడెన్‌తో సంవాదం జరిగిన రెండ్రోజుల తర్వాత తనకు కరోనా వైరస్ సోకిందని ఆయన ప్రకటించారు. ట్రంప్ తానే కరోనా వైరస్ బారిన పడటంతో ఆ వ్యాధిని అరికట్టడంలో విఫలమయ్యారన్న ప్రచారాన్ని ధ్రువీకరించినట్టయింది. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేవారు మంచి ఆరోగ్యంతో ఉండాలని, శక్తివంతంగా కనబడాలని అమెరికన్లు కోరుకుంటారు. అలాంటివారే సమస్యలనుంచి తమను కాపాడగలడన్న నమ్మకం వారికుంటుందంటారు. బైడెన్‌తో జరిగిన సంవాదంలో ఓటమిపాలై వున్న ట్రంప్‌కు కరోనా వైరస్ కూడా సోకిందంటే ఇక చెప్పేదేముంది? కనుకనే వ్యాధినుంచి కోలుకున్నవారు పాటించాల్సిన నియమాలను కూడా పక్కనబెట్టి రెండు వారాలు కాకుండానే ఆయన ఎన్నికల రంగంలోకి ఉరికారు. ఇప్పటికే చాలామంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి సంఖ్య కోటీ పది లక్షల వరకూ ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ముందుగా ఓటే యడం ఇదే ప్రథమం అంటున్నారు. మిగిలినవారు ఓటేయడానికి ఇక మూడు వారాల సమయం మాత్రమే వుంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓటు పెద్దగా పరిగణనలోకి రాదు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే కీలకమైనవి. గత దఫాలో పాపులర్ ఓటు హిల్లరీ పక్షానే వున్నా ఆమె ఓటమి పాలయ్యారని గుర్తుంచుకుంటే... సర్వేలు చూసి ట్రంప్‌ను పరాజితుడిగా లెక్కేయడం సరికాదని అర్థ మవుతుంది. ఇంతవరకూ చేసిన సర్వేలన్నిటా ట్రంప్ కన్నా దాదాపు 10 శాతం ఆధిక్యత కనబరు స్తున్నా ఓటర్ల పూర్తి విశ్వాసాన్ని చూరగొనడంలో బైడెన్ విఫలమయ్యారని గ్యాలప్ సంస్థ తేల్చింది. ట్రంప్ మళ్లీ విజేత అవుతారని 56 శాతంమంది ఓటర్లు భావిస్తుంటే... 40 శాతంమంది మాత్రమే బైడెన్ నెగ్గుతారని అనుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది. నిరుద్యోగం, వర్ణ వివక్ష, కరోనా వైరస్ వంటి అనేక అంశాలు అమెరికా ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కనుకనే ట్రంప్ గెలుపు అనుమానమేనని సర్వేలు అంటున్నాయి. అందులో ఎంతమేర వాస్తవం వుందో వచ్చే నెలలో తేలిపోతుంది. -
అత్యంత గోప్యంగా చంద్రబాబు చేయించిన సర్వే.. లీక్
‘అనంత’ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేయించిన సర్వే నాయకుల్లో గుబులు రేపుతోంది. అత్యంత గోప్యంగా గత జూలైలో చేయించిన ఈ సర్వే రిపోర్టు లీక్ కావడంతో నాయకుల్లో కలవరం మొదలైంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో టిక్కెట్టు దక్కుతుందా? లేదా? అనే ఆలోచన మొదలైంది. 14 అసెంబ్లీ స్థానాల్లో మూడు మినహా తక్కిన చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో కంగుతినడం చంద్రబాబు వంతయింది. మొత్తంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురంలోనే ఈ పరిస్థితి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో గతంలో లేని కొత్త సంప్రదాయాలు, పద్ధతులను చంద్రబాబు అవలంబిస్తున్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లోనే టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి, ర్యాంకులను ప్రకటించారు. నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి, ప్రజలను మరిచిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పట్లో మొదటి ర్యాంకు ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధికి చివరి ర్యాంకు ఇచ్చారు. ఆ తర్వాత 2016లోనూ సర్వే చేయించారు. సర్వే రిపోర్టులు బహిర్గతం చేయడాన్ని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోయారు. వాస్తవ పరిస్థితికి, ర్యాంకుల ప్రకటనకు చాలా వ్యత్యాసం ఉందని, కొంతమందికి టిక్కెట్టు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ర్యాంకులు ప్రకటిస్తున్నట్లుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ వివరణ ఇచ్చుకుని పార్టీ కార్యవర్గం, సమావేశాల నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చామని ప్రకటించింది. ఆ తర్వాత సర్వేలు చేయించినా.. ర్యాంకులు ప్రకటించకుండా గోప్యత పాటిస్తూ వచ్చారు. ‘అనంత’లో పార్టీ పరిస్థితిపై 2016లోనే ఆందోళన టీడీపీ బలంగా ఉన్న జిల్లాలలో అనంతపురానికి మంచిస్థానం ఉందని చంద్రబాబు భావిస్తూ వచ్చారు. 2016లో సర్వే రిపోర్ట్ చూసి కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ‘అనంత’ ప్రజాప్రతినిధులతో పాటు సమన్వయకమిటీ సభ్యులను అమరావతికి పిలిచి సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిపై 13 జిల్లాల్లో సర్వే చేయించానని, రాజధాని ప్రాంత పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలలో పార్టీ బలపడిందని భావిస్తే సర్వే రిపోర్ట్‌లో 56, 61శాతం పార్టీ పరిస్థితి బాగోలేదని వచ్చి అవాక్కయ్యానని జిల్లా నేతలతో అప్పట్లో చంద్రబాబు చెప్పారు. కానీ అనంతపురం రిపోర్ట్ చూస్తే 90శాతం పైగా పార్టీ దిగజారిపోయిందని రిపోర్ట్ వచ్చిందని అప్పట్లో జిల్లా నేతలను హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీలో నేతల మధ్య విభేదాలతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని, తరచూ సర్వేలు చేయించి, పనితీరు బాగోలేని వారికి టిక్కెట్లు ఇవ్వనని బాహాటంగానే హెచ్చరికలు జారీ చేశారు. తాజా సర్వేతో మరింత దిగజారిన పార్టీ పరిస్థితి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత జూలైలో సీఎం స్వయంగా సర్వే చేయించినట్లు తెలిసింది. అయితే ఈ రిపోర్ట్ తాజాగా లీక్ అయింది. పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకు సర్వే ఫలితాలు తెలిసిపోయాయి. 14 నియోజకవర్గాల్లో 11 చోట్ల పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని, 2016లోని సర్వేకు, ఇప్పటికి పోలిస్తే పార్టీతో పాటు నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడైనట్లు తెలుస్తోంది. అనంతపురం పార్లమెంట్లో ఒక స్థానం మినహా తక్కిన ఆరు చోట్ల పార్టీకి ఓటమి తప్పదని తేలినట్లు సమాచారం. ఈ ఆరు స్థానాల్లో ఇప్పటికే నలుగురికి టిక్కెట్లు దక్కవని పార్టీ లీకులు కూడా ఇచ్చింది. ఆ జాబితాలో గుంతకల్లు, అనంతపురం, శింగనమల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు తక్కిన రెండు స్థానాల్లో ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి కాకుండా గుంతకల్లు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీతో పాటు జిల్లాలో కూడా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కూడా కాలవను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీపక్‌రెడ్డి నేరుగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తే రాయదుర్గం కూడా ఈ జాబితాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్‌కు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వరనే ప్రచారం ఉంది. ఇదే క్రమంలో తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు నియోజకవర్గంలో మునుపటి పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పెద్దారెడ్డి నియామకం వారికి ప్రతికూలంగా మారింది. టీడీపీ జెండా మోసిన కాకర్ల రంగనాథ్, జగదీశ్వర్‌రెడ్డి, ఫయాజ్ లాంటి నేతలు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా పరిస్థితి గడ్డుగా ఉంది. ఈక్రమంలో జాబితాలో ఉరవకొండ, తాడిపత్రిలో ఏది ఉందనేది స్పష్టత రావాల్సి ఉంది. -
రికవరీ సంకేతాలు కనబడుతున్నాయ్..
- ప్రభుత్వ పాలసీ చర్యల ప్రభావం - సీఐఐ-ఆస్కాన్ సర్వే నివేదిక న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని.. అయితే, ఇది కాస్త మందకొడిగానే ఉన్నప్పటికీ రికవరీ సంకేతాలు మాత్రం కనబడుతున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీ నిర్ణయాలు, వాటి అమలుతో పాటు వ్యాపార, వినియోగదారుల విశ్వాసం మెరుగుపడుతుండటం వంటివి టర్న్‌ఎరౌండ్‌కు తోడ్పాటునందిస్తున్నాయని భారత పరిశ్రమల సమాఖ్య అసోసియేషన్స్ కౌన్సిల్(సీఐఐ-ఆస్కాన్) సర్వే నివేదిక పేర్కొంది. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక సంఘాల నుంచి ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా నివేదికను రూపొందించినట్లు సీఐఐ- ఆస్కాన్ చైర్మన్ నౌషద్ ఫోర్బ్స్ చెప్పారు. ఇంకా కొంత మందగమన ధోరణి నెలకొన్నప్పటికీ.. పారిశ్రామికాభివృద్ధి క్రమంగా పురోగమిస్తుండటం సానుకూల పరిణామమని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడినట్లు ఆయన వెల్లడించారు. సమీప కాలంలో వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా నివేదిక తెలిపింది. వృద్ధి దిగజారుతుందంటూ గతేడాది ఇదే కాలంలో అనేక రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులు పేర్కొనగా.. ఇప్పుడు అతికొద్ది రంగాలు మాత్రమే ఈ విధమైన ధోరణి ఉండొచ్చని అంచనా వేయడం గమనార్హం. జూన్ క్వార్టర్(క్యూ1)లో అమ్మకాలు, ఉత్పాదకత, ఎగుమతుల ధోరణి చాలా బాగుందని(వృద్ధి 20 శాతం పైగానే) 16.1 శాతం రంగాల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం 93 పారిశ్రామిక రంగాలు సర్వేలో పాల్గొన్నాయి. గతేడాది జూన్ త్రైమాసికంలో ఇది 7.1 శాతం మాత్రమే. గతేడాది క్యూ1లో బాగుంది(వృద్ధి 10-20 శాతం) అన్న అభిప్రాయం 14.3 శాతంగా ఉండగా.. ఇప్పుడు 9.3 శాతానికి తగ్గిపోయింది. అయితే, ప్రతికూల వృద్ధి అంచనాలు 26.9 శాతం నుంచి 23.6 శాతానికి దిగిరావడం విశేషం. వ్యాపార వృద్ధి ప్రతిబంధకంగా మారుతున్న అంశాల్లో తీవ్రమైన పోటీ, చౌక దిగుమతులు, విద్యుత్ కొరత, నియంత్రణపరమైన ఇబ్బందులు, దేశీయంగా, ఎగుమతులకు కూడా తగిన డిమాండ్ లేకపోవడం, నిపుణులైన కార్మికుల కొరత, అధిక పన్నులు ప్రధానంగా ఉన్నాయని సర్వేలో 50 శాతం అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీరేట్లు, రవాణా ఇతరత్రా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇబ్బందులు వంటివి కూడా కొంతమేర వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని వారు అంటున్నారు. అయితే, రికవరీ నిలదొక్కుకోవాలంటే డిమాండ్, పెట్టుబడులు పుంజుకోవాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక ప్రతినిధులు స్పష్టం చేశారు. వస్తు-సేవల పన్ను(జీఎస్టీ), భూసేకరణ చట్టం వంటి కీలక సంస్కరణల అమల్లో పురోగతి కూడా ఇన్వెస్టర్లల్లో మరింత స్పష్టత తీసుకొస్తుందని సర్వే నివేదిక పేర్కొంది. -
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జోరు