Lawn bowls
-
పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్.. లాన్‌బౌల్స్‌లో మరో పతకం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించి, స్వదేశంలో అంతగా ఆదరణ లేని క్రీడల్లో సైతం పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ (4 పతకాలు), లాన్‌బౌల్స్ (1), జూడో (3), స్క్వాష్ (1) వంటి క్రీడల్లో ఇప్పటికే 8 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా లాన్‌బౌల్స్‌లో మరో పతకం సాధించారు. పురుషుల టీమ్ ఈవెంట్లో సునీల్ బహదూర్, నవ్‌నీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో నార్త్రన్ ఐర్లాండ్ చేతిలో 5-18 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది. తద్వారా లాన్‌బౌల్స్‌లో రెండో మెడల్, ఓవరాల్‌గా 29వ మెడల్ (9 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు) భారత్ ఖాతాలో చేరాయి. మహిళల లాన్‌బౌల్స్ టీమ్ ఈవెంట్లో భారత్ ఇదివరకే స్వర్ణం నెగ్గి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లవ్లీ చౌబే, పింకి, నయన్మోని సైకియా, రూపా రాణితో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికా టీమ్‌పై 17-10 తేడాతో విజయం సాధించి స్వర్ణం సాధించింది. కాగా, కామన్వెల్త్ క్రీడల తొమ్మిదో రోజు (రాత్రి 7 గంటల వరకు) భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు, లాన్‌బౌల్స్‌లో ఓ పతకాన్ని భారత్ సొంతం చేసుకుంది. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్‌తో బోణీ కొట్టగా.. ఆతర్వాత పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. తాజాగా పురుషుల లాన్‌బౌల్స్ టీమ్ కూడా రజతం సాధించింది. భారత్ ఇవాళ సాధించిన మూడు పతకాలు రజతాలే కావడం విశేషం. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో తొలి పతకం ఖరారు -
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా
స్కాట్లాండ్కు చెందిన జార్జ్ మిల్లర్ ‘లేట్ వయసు’లో గ్రేట్ అనిపించుకున్నాడు. 75 ఏళ్ల 8 నెలల జార్జ్ ‘లాన్ బౌల్స్’ మిక్స్డ్ పెయిర్లో బంగారు పతకం సాధించాడు. మెలనీ ఇన్నెస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పసిడి పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు (భారత్) 21–10, 21–9తో కొబుగెబ్ (ఉగాండా)పై... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–9, 21–12తో దిమిందు అబెవిక్రమ (శ్రీలంక)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 21–2, 21–4తో జెమీమా –గనెసా ముంగ్రా (మారిషస్) జోడీని ఓడించింది. 4X400 రిలే ఫైనల్లో భారత్: అథ్లెటిక్స్ పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే విభాగంలో అనస్, నోవా నిర్మల్, అజ్మల్, అమోజ్ జేకబ్‌లతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యెర్రాజీ 13.18 సెకన్లలో లక్ష్యానికి చేరి ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. సెమీస్‌లో శ్రీజ: టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో 11–7, 8–11, 11–8, 11–13, 11–9తో ఫిచ్‌ఫోర్డ్–హో టిన్టిన్ (ఇంగ్లండ్) జంటపై నెగ్గి సెమీఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 9–11, 11–4, 6–11, 9–11, 11–5, 11–4, 11–8తో మో జాంగ్ (కెనడా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. -
Lan Bowls: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’
సాధారణంగానైతే కామన్వెల్త్ క్రీడల్లో పతకం... అదీ స్వర్ణం సాధించిన వారి గురించి ఇలాంటి పరిచయ కార్యక్రమం అవసరం ఉండదు. కానీ లాన్ బౌల్స్ ఆట గురించే అరుదుగా తెలిసిన దేశంలో అందులోని క్రీడాకారుల గురించి అంతకంటే ఎక్కువగా తెలిసే అవకాశం లేదు. అసలు ప్రాచుర్యం పొందని ఆటను ఎంచుకోవడంలోనే ఒక సాహసం ఉంటే ఇప్పుడు అదే క్రీడలో కామన్వెల్త్ క్రీడల పసిడి గెలుచుకోవడం అసాధారణం. కానీ పై నలుగురు మహిళలు దానిని చేసి చూపించారు. ఒక్కసారిగా అందరి దృష్టీ తమపై పడేలా చేశారు. సగటు క్రీడాభిమాని భాషలో... ‘ఆట గురించైతే పూర్తిగా తెలీయదు, కానీ ఫలితం చూస్తే ఆనందం మాత్రం వేసింది’ అనడం సరిగ్గా సరిపోతుందేమో! –సాక్షి క్రీడా విభాగం లాన్ బౌల్స్ స్వర్ణం గెలిచిన నలుగురికీ క్రీడాకారులుగా ఇది రెండో ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. గాయాల కారణంగా లవ్లీ, నయన్మోని కెరీర్లు అర్ధాంతరంగా ఆగిపోతే క్రీడల్లో కొనసాగాలనే ఆసక్తితో మరో కొత్త ఆటను ఎంచుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున క్రికెట్ ఆడిన పింకీ పని చేస్తున్న పాఠశాల ఒకసారి నేషనల్ లాన్ బౌల్స్‌కు వేదికైంది. ఆ సమయంలో ఆటను చూసిన ఆమె కొద్ది రోజుల్లోనే దానిని నేర్చుకోవడంతో పాటు జాతీయ శిబిరానికి అర్హత సాధించింది. టీమ్ గేమ్ కాకుండా వ్యక్తిగత క్రీడకు మారాలనుకున్న రూప అనుకోకుండా బౌల్స్ వైపు వచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం అందించిన నగదు పురస్కారం కబడ్డీకంటే ఎక్కువగా ఉండటంతో ఇక్కడే కొనసాగింది. మన దేశంలో లాన్ బౌల్స్ ఆడేందుకు తగిన సౌకర్యాలు కనిపించవు. ప్రమాణాలకు అనుగుణంగా లాన్స్ లేకపోవడంతో పాటు బౌల్స్ కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో వీరు ప్రతికూలతలను దాటి ఇలాంటి విజయం సాధించడం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. మాజీ క్రికెట్ అంపైర్ అయిన మధుకాంత్ పాఠక్ వీరందరికీ కోచింగ్ ఇచ్చారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత ఆటగాళ్లు సింథటిక్ గ్రాస్‌పై ప్రాక్టీస్ చేయగా... అక్కడికి వెళ్లాక సహజమైన పచ్చిక ఎదురైంది. దాంతో వారి ఆటలో గందరగోళం కనిపించింది. సహజ పచ్చికపై బౌల్ చేసేందుకు ఎక్కువగా భుజ బలం అవసరం. అక్కడ దెబ్బతిన్న వీరు ఆ తర్వాత సాధనను మార్చారు. ప్రైవేట్ రిసార్ట్‌లలో మాత్రమే ఉండే సౌకర్యాలను సొంత ఖర్చులతో ఉపయోగించుకున్నారు. వేర్వేరు పోటీల ద్వారా పరిచయమైన ఈ నలుగురు దాదాపు పదేళ్లుగా కలిసి ఆడుతున్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో పెయిర్స్ విభాగంలో రూప, పింకీ కాంస్యానికి చేరువగా వచ్చి పతకం కోల్పోయారు. వీరిద్దరితో పాటు 2014, 2018లో లవ్లీతో కలిసి ‘ట్రిపుల్స్’ ఆడగా క్వార్టర్ ఫైనల్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు నయన్మోని కలిసి రాగా నలుగురి బృందం ‘ఫోర్స్’లో గోల్డ్‌వైపు సాగిపోయింది. గత ఓటముల బాధ తాజా విజయపు ఆనందాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. గెలుపు ఖరారైన క్షణాన, పతకాలు అందుకునేటప్పుడు వారి సంబరాల్లో అది స్పష్టంగా కనిపించింది. నలుగురితో పాటు దశాబ్దకాలంగా జట్టు మేనేజర్‌గా ఉన్న అంజు లుత్రా పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. తన కుమార్తెలవంటి వీరితో సుదీర్ఘ కాలంగా సాగించిన ప్రయాణం తర్వాత దక్కిన ఈ పతకం ఆమెనూ భావోద్వేగానికి గురి చేసింది. ఒక రకంగా వీరందరికీ కామన్వెల్త్ క్రీడలు చావో, రేవోగా మారాయి. ఎవరూ పట్టించుకోని ఆటలో ఇంకో పరాజయం అంటే ఇక కెరీర్లు ముగిసినట్లే అని భావించారు. ఇప్పటి వరకు ఎంతో కొంత సహకారం అందించివారు కూడా సహజంగానే వెనక్కి తగ్గుతారు. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కచ్చితంగా వారితో పాటు ఆటను కూడా ఒక మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. లవ్లీ చౌబే: వయసు 42 ఏళ్లు, మాజీ స్ప్రింటర్, పోలీస్ కానిస్టేబుల్, జార్ఖండ్ పింకీ: 41 ఏళ్లు, మాజీ క్రికెటర్, పీఈటీ, ఢిల్లీ రూపా రాణి టిర్కీ: 34 ఏళ్లు, మాజీ కబడ్డీ క్రీడాకారిణి, జిల్లా క్రీడాధికారి, జార్ఖండ్ నయన్మోని సైకియా: 33 ఏళ్లు, మాజీ వెయిట్‌లిఫ్టర్, అటవీ అధికారి, అసోం HISTORY CREATED 🥳 1st Ever 🏅 in Lawn Bowls at #CommonwealthGames Women's Fours team win 🇮🇳 it's 1st CWG medal, the prestigious 🥇 in #LawnBowls by defeating South Africa, 17-10 Congratulations ladies for taking the sport to a new level🔝 Let's #Cheer4India#India4CWG2022 pic.twitter.com/uRa9MVxfRs — SAI Media (@Media_SAI) August 2, 2022 చదవండి: Commonwealth Games 2022: బౌల్స్‌లో బంగారం... టీటీలో పసిడి Emma McKeon: కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ -
CWG 2022: చరిత్ర సృష్టించిన భారత్.. స్వర్ణం నెగ్గిన వుమెన్స్ టీమ్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల లాన్ బౌల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి లాన్ బౌల్స్ క్రీడలో పతకాన్ని సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వుమెన్స్ టీమ్.. ఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో భారత్ పటిష్టమైన ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆట ఆరంభంలో టీమిండియాను తక్కువ అంచనా వేసిన సఫారీ టీమ్.. ఆ తర్వాత తేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక దశలో దక్షిణాఫ్రికా 10-10తో స్కోర్‌ను సమం చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత టీమిండియా రెచ్చిపోయి ప్రత్యర్ధిని అదే స్కోర్ వద్ద ఉంచి ఘన విజయం సాధించింది. భారత జట్టులో రూపా దేవి ట్రికీ, నయన్మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్ అద్భుతంగా రాణించారు. సెమీస్‌లో భారత్.. న్యూజిలాండ్‌ను 16-13 తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. ఇదిలా ఉంటే, లాన్ బౌల్స్‌లో స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య పదికి (4 స్వర్ణాలు, 3 రజతాలు, మూడు కాంస్యాలు) చేరింది. చదవండి: కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ -
స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి?
బర్మింగ్‌హామ్: లాన్ బౌల్స్... కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమైన నాటినుంచి ఒక్కసారి మినహా ప్రతీసారి ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉంది. 2010 నుంచి మాత్రమే పాల్గొంటున్న భారత్ అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మన మహిళలు కొత్త చరిత్రను సృష్టించారు. లాన్ బౌల్స్ ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేశారు. లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కీ, పింకీ, నయన్మోని సైకియా సభ్యులుగా ఉన్న భారత బృందం సెమీఫైనల్లో 16–13 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో విజయం సాధిస్తే భారత్‌కు స్వర్ణ పతకం దక్కుతుంది. ఓడితే రజతం లభిస్తుంది. భారత పురుషుల జట్టు మాత్రం 8–26 తేడాతో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడి క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ‘లాన్ బౌల్స్’ ఎలా ఆడతారంటే... సింగిల్స్, డబుల్స్‌లతో పాటు టీమ్‌లో నలుగురు ఉండే ‘ఫోర్స్’ ఫార్మాట్లు ఇందులో ఉన్నాయి. పచ్చిక మైదానంలో ఆడే ఈ ఆటలో ‘బౌల్స్’గా పిలిచే రెండు పెద్ద సైజు బంతులతో పాటు ‘ది జాక్’ అని చిన్న బంతి కూడా ఉంటుంది. టాస్ వేసి ముందుగా ఎవరు బౌల్ చేస్తారో, ఎవరు జాక్‌ను విసురుతారో తేలుస్తారు. ముందుగా ఒకరు ‘జాక్’ను అండర్ ఆర్మ్ త్రో తో విసురుతారు. ఆపై మరో జట్టు సభ్యులకు బౌల్స్ విసిరే అవకాశం లభిస్తుంది. ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఒక్కో జట్టు ఒక్కో రౌండ్ (ఎండ్)లో ఎనిమిది త్రోలు విసరవచ్చు. ఇలా 18 రౌండ్లు ఉంటాయి. ‘జాక్’కు సాధ్యమైనంత దగ్గరగా బౌల్ చేయడమే ఫలితాన్ని నిర్దేసిస్తుంది. ప్రత్యర్థికంటే ఎన్ని తక్కువ ప్రయత్నాల్లో జాక్‌కు దగ్గరగా బౌల్ చేయగలరో అన్ని పాయింట్లు జట్టు ఖాతాలో చేరతాయి. చివర్లో ఈ పాయింట్లను లెక్కకట్టి విజేతను నిర్ణయిస్తారు. 🇮🇳 Creates History at @birminghamcg22 🔥 India's #LawnBowl Women's Four team creates history by becoming the 1st Indian Team to reach the Finals of #CommonwealthGames India 🇮🇳 16- 13 🇳🇿 New Zealand (SF) They will now take on South Africa in the Finals on 2nd Aug#Cheer4India pic.twitter.com/tu64FSoi8R — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం -
గోలీలాట గుర్తొస్తుంది..!
గ్లాస్గోలో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఓ క్రీడ చాలా మంది భారతీయులకు ఆశ్చర్యం కలిగించింది. ఇదేదో.. మన పల్లెల్లో పిల్లలు ఆడే గోలీల ఆటలా ఉందే అనుకున్నారు. పరీక్షించి చూస్తే.. పచ్చని మైదానం.. చుట్టూ గట్టు కట్టినట్లుగా ఏర్పాటు. మైదానానికి ఓ వైపున ఆటగాళ్లు నిలుచుని మరోవైపున గల ఓ చిన్న బంతిని లక్ష్యంగా చేసుకొని బంతుల్ని దొర్లిస్తున్నారు. ఈ బంతులు కొన్ని అవతలి వైపున గల బంతికి తగులుతుండగా, మరికొన్ని దాని సమీపంలోకి వెళ్తున్నాయి. చివరికి దీన్ని ‘లాన్ బౌల్స్’ అంటారని, మనవాళ్లూ ఇందులో ఆడుతున్నారని అర్థమైంది. ఇంతకీ ఏంటీ లాన్ బౌల్స్..! క్రీడలంటేనే శరీర దారుఢ్యం, ఫిట్‌నెస్‌లపై ఆధారపడివుంటాయి. కానీ, క్రీడాకారులకు ఉండాల్సిన ఫిట్నెస్ లేకపోయినా, శరీర పరిమాణం ఏ స్థాయిలో ఉన్నా, అంగవైకల్యం ఉన్నవారైనా.. వయసులో తేడాలున్నా.. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడగలిగే క్రీడ లాన్ బౌల్స్. లాన్ (మైదానం)లో నిలుచున్న స్థానం నుంచి బంతిని లక్ష్యానికి దగ్గరగా బౌల్ (దొర్లించడం) చేయడమే ఈ ఆట. అటు జాక్.. ఇటు బాల్ చతురస్రాకారంలో ఉన్న, చుట్టూ తక్కువ ఎత్తులో గోడ నిర్మించిన మైదానంలో లాన్ బౌల్స్ క్రీడను ఆడతారు. మైదానం మధ్యలో బంతిని దొర్లించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని ‘రింక్’ అని, లక్ష్యంగా పేర్కొంటూ మరో వైపున ఉంచే బంతిని ‘జాక్’ అని పిలుస్తారు. ఆటగాడు మైదానం గోడ అంచున ప్లాస్టిక్ మ్యాట్‌పై నిలబడి జాక్ దిశగా బంతిని దొర్లిస్తాడు. అది సింగిల్స్ మ్యాచ్ అయితే ఇద్దరు ఆటగాళ్లు నాలుగు చొప్పున బంతుల్ని బౌల్ చేస్తారు. తొలి ఆటగాడు నాలుగు బంతుల్ని బౌల్ చేశాక ప్రతి బంతికి, జాక్‌కు మధ్య దూరాన్ని కొలుస్తారు. ఆ తరువాత రెండో ఆటగాడు తన బంతుల్ని దొర్లిస్తాడు. జాక్‌తో అతని బంతులకు మధ్య గల దూరాన్ని కొలిచాక.. మొత్తంగా ఎవరు జాక్‌కు అతి సమీపంగా బౌల్ చేయగలిగారో, వారే విజేత అవుతారు. ఇందులో సింగిల్స్‌తోపాటు డబుల్స్, ట్రిపుల్స్, నలుగురు ఆటగాళ్లు తలపడే కేటగిరీలు ఉంటాయి. ఆయా కేటగిరీలను బట్టి ఆటగాళ్లు బౌల్ చేసే బంతుల సంఖ్య ఉంటుంది. ఓస్.. ఇంతేనా! అనుకుంటే కుదరదు. ఇందులో ఉపయోగించే బంతులు క్రికెట్ బంతుల్లా అంత తేలిగ్గా దొర్లుకుంటూ వెళ్లవు. బంతులకు రింగులు... లాన్‌పై బౌల్ చేసే బంతులు ప్రత్యేకంగా తయారవుతాయి. బంతికి రెండు వైపుల రెండు రింగుల్ని ఏర్పాటు చేస్తారు. ఒకవైపు రింగు పెద్ద సైజులో ఉంటే, మరోవైపు చిన్నసైజు రింగు ఉంటుంది. దీంతో బంతిని బౌల్ చేసినప్పుడు అది నేరుగా దొర్లకుండా.. వక్రమార్గంలో వెళ్తుంది. అందుకే జాక్‌ను గురిచూసి బంతిని దొర్లించినా.. సమీపంలోకి వెళ్లడమన్నది అంత తేలిగ్గా జరగదు. బంతిపైనా, అది ప్రయాణించే మార్గంపైనా నియంత్రణతో బౌల్ చేయడమే ఈ క్రీడలోని అసలు నైపుణ్యం. 14వ శతాబ్దంలో వెలుగులోకి.. ప్రపంచంలోని ప్రాచీన క్రీడల్లో లాన్ బౌల్స్ కూడా ఒకటి. ఈజిప్టులో వేల సంవత్సరాల క్రితమే ఈ క్రీడను ఆడినట్లుగా చెబుతారు. అయితే ఇది వెలుగులోకి వచ్చింది మాత్రం 14వ శతాబ్దంలో. అయితే అంతకుముందే 1299లో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో ఈ క్రీడ పేరిట క్లబ్ ఏర్పాటైంది. 1588లో ఇంగ్లండ్ నావికుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ తొలిసారిగా ఈ క్రీడను నిర్వహించాడు. ఆ తరువాత బ్రిటిష్ పాలిత దేశాల్లో ఇది వ్యాప్తి చెంది.. ప్రపంచ బౌల్స్ సమాఖ్య ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సమాఖ్యలో 51 సభ్యదేశాలు, 55 బౌల్స్ అథారిటీలు ఉన్నాయి. లాన్బౌల్స్ను 1930లో కామన్వెల్త్ క్రీడల్లో చేర్చగా.. 84 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. భారత్‌లో పరిస్థితి... పేరుకు లాన్ బౌల్స్ అయినా.. ఇలాంటి తరహా ఆటలు మన పల్లెల్లో పురాతన కాలం నుంచీ ఆడుతూ వస్తున్నవే. అయితే అంత ర్జాతీయ స్థాయిలో లాన్ బౌల్స్‌లో మనవాళ్లు ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడినా.. పతకం దాకా అయితే రాలేకపోయారు. ఇక ఇటీవల గ్లాస్గోలో మెన్స్ ఫోర్ కేటగిరీలో పోటీపడి సెమీఫైనల్‌కు చేరుకున్నారు. కానీ, సెమీస్‌లో ఓడడంతోపాటు కాంస్య పతక పోరులో కొద్ది తేడాతో ఓడిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో మున్ముందు పతకాలు సాధిస్తే లాన్ బౌల్స్.. భారత్‌లోనూ ప్రాచుర్యం పొం దే అవకాశం ఉంది. - శ్యామ్ కంచర్ల -
లాన్ బౌల్స్‌లో చేజారిన కాంస్యం
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో లాన్‌బౌల్స్‌లో తొలిసారి పతకం సాధించే సువర్ణావకాశం కొద్దిలో భారత్ చేజారింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నలుగురు సభ్యుల పురుషుల కాంస్య పతక పోరులో భారత్ 14-15తో ఓటమిపాలైంది. కమల్‌కుమార్ శర్మ, చందన్కుమార్సింగ్, సమిత్ మల్హోత్రా, దినేశ్కుమార్లతో కూడిన భారతజట్టు ఎనిమిదో ఎండ్ ముగిసేటప్పటికి 11-5తో తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. అయితే చివరి ఎండ్‌లో ఒత్తిడికి లోనై మ్యాచ్‌ను, కాంస్య పతకాన్ని చేజార్చుకుంది.