సెహ్వాగ్ కనీస ధర రూ. 2 కోట్లు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో పాల్గొనే ఆటగాళ్ల కనీస ధర జాబితాను లీగ్ కౌన్సిల్ ఫ్రాంఛైజీలకు అందించింది. భారత జట్టులో స్థానం కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తమ కనీసధరను రూ. 2 కోట్లుగా పేర్కొన్నారు.
మొత్తం 208 మంది అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన జాబితాలో 48 మంది భారత జట్టుకు ఆడిన, ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 11 మంది భారత క్రికెటర్లు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా పేర్కొన్నారు. ఓజా, ఉతప్ప, నెహ్రా, మనోజ్ తివారీ, యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, దినేశ్ కార్తీక్, ప్రవీణ్ కుమార్, మురళీ విజయ్ ఈ జాబితాలో ఉన్నారు. ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది.
ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్, జహీర్, పుజారా తమ కనీసధరను రూ.1.5 కోట్లుగా పేర్కొన్నారు. వరుణ్ ఆరోన్ వేలం జాబితాలో లేడు. ఉమేశ్ యాదవ్ తన కనీస రేటును పేర్కొనలేదు. బరోడా వికెట్ కీపర్ పినాల్ షా పేరును ఈ జాబితాలో చూపించారు. తర్వాత తప్పు సరిదిద్దుకున్నారు.