leg spinner Shane Warne
-
క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మొదటి బౌలర్ షేన్ వార్న్
క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు ఎందరో ఉంటారు.. కానీ తమ ఆటతో ప్రత్యర్థులనే ఓ ఆటాడించి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని లెజెండ్‌గా మారేది మాత్రం కొందరే. అటువంటి దిగ్గజ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్పిన్నింగ్ దిగ్గజం షేన్ వార్న్ ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్న్ తన క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాయిలు అధిగమించాడు. అలానే చెరిగిపోని రికార్డులు మరెన్నో తన పేరుమీద లిఖించుకున్నాడు. ఇలాంటివి బోలెడు ఉన్నా షేన్ వార్న్‌కి క్రికెట్ కెరీర్లో మర్చిపోలేని రోజు ఏదైనా ఉందంటే 2006 ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 700వ వికెట్ సాధించడమనే చెప్పాలి. విక్టోరియన్ గ్రౌండ్లో 89,155 మంది ప్రేక్షకుల మధ్య ఇంగ్లాండ్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ వికెట్ తీసి అంతవరకు ఎవరికీ సాధ్యపడని ఘనతను సాధించి చూపాడు. ఆ వికెట్‌తో ప్రపంచ క్రికెట్ చరిత్రోలో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అనంతరం అదే మ్యాచ్‌లో వార్న్ నలుగురు బ్యాట్స్మెన్లను పెవిలియన్‌కు తన టెస్ట్ కెరీర్లో ఐదు వికెట్లను పడగొట్టడం ద్వారా 37వ చివరి ఐదు వికెట్ల హాల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
టీమిండియాకు కోచ్ కావాలని ఉంది: స్పిన్నర్
లెజండరీ ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ తన మనసులోని మాట బయటపెట్టాడు. టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టాలని ఉందని చెప్పాడు. భవిష్యత్తులో తనను కోచ్‌గా సేవలందించాలని బీసీసీఐ కోరితే నిరాకరించబోనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీమిండియా డైరెక్టర్‌గా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి బాధ్యతలు అందిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకొనే అవకాశముంది. దీంతో జట్టుకు పూర్తికాల కోచ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నియమించే అవకాశముంది. 'టీమిండియాతో పనిచేయడానికి ఇష్టపడతాను. చాలా ప్రతిభావంతమైన, అద్బుతమైన టీమ్ అది. జట్టుపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. వందకోట్లమంది మద్దతు కలిగిన జట్టు అది. ఒక్కసారి తప్పుచేసినా నిలదొక్కుకోవడం కష్టం. కాబట్టి అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిస్తా' అంటూ కోచ్ విషయంలో తన ఆలోచన బయటపెట్టాడు వార్న్. 'నా జీవితంలో ఎప్పుడూ ఏ దానికి నో చెప్పలేదు. ఇండియాకు కోచ్‌గా ఉండటానికి కానీ, ఐపీఎల్లో కోచ్‌గా సేవలందించడంలోగానీ ఎప్పుడూ ఓపెన్‌గానే ఉన్నాను. క్రికెట్‌తో కొనసాగాలని భావిస్తున్నా. నాకు కామెంటరీ కూడా ఇష్టమే. నేను చెప్తుంటే ప్రజలు ఆనందిస్తారని భావిస్తాను. కోచ్‌గా బాధ్యతలు నిర్వహించడానికీ నేను సిద్ధంగా ఉన్నాను' అని షేన్ వార్న్ చెప్పాడు.