lejend
-
బీ-ఫాం ఇచ్చారు.. లెజెండ్ ఆపండి
అనంత కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ వినతి అనంతపురం హిందూపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా సినీ నటుడు బాలకృష్ణ బీ-ఫాం అందజేశారని, ఈ పరిస్థితిలో ఆయన నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ బి.నారాయణరెడ్డి, కోఆర్డినేటర్ గాండ్ల ఆదినారాయణ కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను కోరారు. బుధవారం వారు కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని కలెక్టర్.. ఎన్నికల కమిషన్ (ఢిల్లీ) దృష్టికి తీసుకెళ్లారని, వారి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు -
సత్యదేవ్ దర్శకత్వంలో బాలయ్య
‘లెజెండ్’తో విజయోత్సాహంలో ఉన్న బాలకృష్ణ... తన తర్వాతి చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఇది ఆయన 98వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ అనే నూతన దర్శకుణ్ణి పరిశ్రమకు పరిచయం చేయనున్నారాయన. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రపాటి రమణరావు నిర్మాత. మే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను శుక్రవారం ఓ ప్రకటన ద్వారా నిర్మాత తెలిపారు. ‘‘‘లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మించనున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని చెప్పారు.