leukaemia
-
మీది గొప్ప మనసు ...ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!
ఆస్ట్రేలియా: పోలీసుల అంటేనే చాలామందికి భయంవేస్తుంది. అంతేకాదు పైగా వాళ్లు వృత్తి రీత్యా క్రూరంగా ఉండాల్సి రావడం వల్లనో తెలియదు గానీ చాలా మంది ప్రజలకు పోలీసులపై సదాభిప్రాయం ఉండదు. కానీ ఈ ఆస్ట్రేలియా పోలీసునే చూస్తే కచ్చితంగా అభిప్రాయం మారతుందని చెప్పక తప్పదు. (చదవండి: బాబోయ్! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!) ఇంతకీ అసలు విషయంలోకెళ్లితే....ఆస్రేలియాకి చెందిన ఒక బాలుడు లుకేమియా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ బాలుడు యెప్రాడ్ రూస్టర్ అనే కోడిపిల్లను పెంచకుంటున్నాడు. ఆ బాలుడి పెంపుడు కోడిపిల్ల రాత్రిళ్లు విపరీతంగా శబ్దం చేస్తుందంటూ ఇరుగు పోరుగు వాళ్లు పోలీసులు ఫిర్యాదులు చేస్తారు. దీంతో ఆ బాలుడి తండ్రి పోలీసులు ఇంకో పదిరోజుల్లో తమ కొడుకు పెంచుకుంటున్న కోడిపిల్లను తీసుకువెళ్లిపోతారని తెలిసి పోలీసులకు తమ సమస్యను వివరించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఫెయిర్‌ఫీల్డ్ సిటీ పోలీస్ ఏరియా కమాండ్ అధికారితో ఆ బాలుడు తండ్రి మాట్లాడుతూ...నా కొడుకు లుకేమియాతో బాధపడతున్నాడు. తరుచుగా కీమోథెరఫీ చికిత్సల కారణంగా డల్‌గా అవకూడదనే ఉద్దేశంతోనే రూస్టర్ అనే కోడిపిల్లను ఇచ్చాను. పైగా వాడు దానికి జాన్సన్ అనే పేరు పెట్టడమే కాక ఆహారం పెడుతూ ఆడుకుంటూ ఉత్సహంగా ఉంటున్నాడు" అని చెబుతాడు. దీంతో సదరు పోలీస్ అధికారి, కానిస్టేబల్ ఫ్రాంకీ వారి బాధను అర్థం చేసుకోవడమే కాక మీ కొడుకు ఏమి రూస్టర్కి వీడ్కోలు చెప్పాల్సిన అవసరం లేదని చెబురు. పైగా ఆ బాలుడుతో తమకు అందమైన పోలం ఉందని అక్కడ ఈ యెప్రాడ్ రూసర్ హాయిగా పెరుగుతుందని అంటారు. అంతేకాదు నీవు ఎప్పుడూ కావల్సి వస్తే అప్పుడు ఈ రూస్టర్ని వచ్చి చూడవచ్చు అని ఆ బాలుడికి చెబుతారు. ఈ మేరకు ఆ బాలుడికి బొమ్మలు, పోలీస్ యూనిఫాం, టోపి వంటి బహుమతులు కూడా ఇస్తారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌తో సహా నెటిజన్లంత పోలీసుల దయార్ద్ర హృదయాన్ని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: లాక్డౌన్లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!) -
మా అమ్మ పక్కనే నన్నూ పూడ్చండి
లండన్: ఫిలిప్ క్వాస్ని అనే ఏడేళ్ల బాలుడు శుక్రవారం లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో క్యాన్సర్‌తో మృతి చెందాడు. అతడి చివరి కోరిక.. తల్లి సమాధి పక్కనే తననూ ఉంచమని. అలా చేస్తే.. స్వర్గంలో 'తల్లి తనను క్షేమంగా చూసుకుంటుందని'. ఆ పసివాడి చివరికోరిక విని చాలా హృదయాలు స్పందించాయి. ఫిలిప్ క్వాస్నీ తల్లి ఎజ్నియెస్కాను సైతం క్యాన్సరే పొట్టనపెట్టుకుంది. 2011లో ఆమె మృతి చెందారు. తండ్రి పీటర్ క్వాస్నీతో ఉంటున్న ఫిలిప్‌కి గత ఏడాది సెప్టెంబర్‌లో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. జువెనైల్ మైలోమోనోసైటిక్ ల్యుకేమియా(జేఎమ్ఎమ్ఎల్) నుంచి ఫిలిప్‌ను రక్షించడానికి డాక్టర్లు కీమోథెరపి, స్టెమ్‌సెల్ థెరపీలను చేసినా ఫలితం లేకపోయింది. ఫలిప్ చివరికోరిక కోసం దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. ఇందుకోసం 6,500 పౌండ్లు అవుతుందని కుంటుంబ సభ్యులు భావించగా.. ఆన్లైన్ ఫండ్‌రైజింగ్ సైట్ 'జస్ట్‌గివింగ్' ద్వారా 41,000 పౌండ్లను విరాళంగా అందించారు. 'చనిపోతానని ఫిలిప్‌కు ముందే తెలుసు. అతని చివరి కోరిక మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తాం. నా చేతులతో ఫిలిప్‌ను పూడ్చాల్సి వస్తుందని అసలు ఊహించలేదు' అని పీటర్ కన్నీరుమున్నీరయ్యారు. కుమారుడి చివరికోరిక కోసం స్పందించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీటర్ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అతను వెన్నుపూసలో గ్యాప్(స్పైనల్ బిఫిడా)తో పాటు డయాబెటిస్, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. అందుకే ఫిలిప్ చివరికోరిక కోసం ఆ కుటుంబం నిధుల సమీకరణకు వెళ్లాల్సి వచ్చింది. త్వరలో ఫిలిప్ చివరి కోరికను తీర్చనున్నట్లు పీటర్ తెలిపారు. -
ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో!
బర్మింగ్ హామ్: ప్రేమించడం అందరూ చేస్తారు. కానీ ఆ ప్రేమను కొందరే నిలుపుకుంటారు. ప్రేమించిన వ్యక్తి ఎప్పుడూ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. వారి ఆలోచనలు అలా మనసులో ఉండిపోతే చాలు.. జీవితాంతం మరే దిగులు లేకుండా బతికేయోచ్చనుకునేవారు కొందరైతే.. తనతో పెళ్లవకపోయినా.. ప్రేమించిన వ్యక్తి ప్రాణాలతో ఎదురుగా ఉంటే అప్పుడప్పుడు చూసైనా సంతోషంగా జీవితాన్ని ముందుకు పోనిద్దాం అని ఆలోచించేవారు మరికొందరు. ఇంకొందరు ప్రారంభంలో ఎంత దూరంగా ఉన్నా.. ఆ వ్యక్తి శాశ్వతంగా దూరమవుతున్నాడని తెలిసినప్పుడు క్షణం కూడా విడిచిపెట్టకుండా తోడుగా ఉండేవారు. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని ఒట్టేసి చెప్పుకునే ప్రేమికులు చాలావరకూ.. పెళ్లి కాకుండానే విడిపోతున్న ఈ రోజుల్లో మరో మూడు రోజుల్లో తనను ప్రేమించిన వ్యక్తి కనుమూస్తాడని తెలిసి ఆ కొద్ది కాలంపాటు జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమైంది హైస్కూల్లో చదివే పదహారేళ్ల అమీ క్రాస్ వెల్. నిచ్చెలి చేయందుకున్న మూడు రోజుల్లోనే అతడు చనిపోయాడు. ఆ జ్ఞాపకాలతో తిరిగి అమీ జీవితాన్ని ప్రారంభించింది. బర్మింగ్ హామ్ కు చెందిన అమీ క్రాస్ వెల్, ఒమర్ అల్ షేక్ అనే ఇద్దరు ఓ హైస్కూల్లో చదువుతున్నారు. వీరిద్దరికి కూడా పదహారేళ్లు. స్కూల్లో చేరిన కొద్ది రోజులకే అమీపై ఒమర్ మనసు పారేసుకున్నాడు. ఎంతో కష్టంతో ఆ విషయాన్ని తెలియజేశాడు. చివరికి అమీ ఒప్పుకోవడంతో అతడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. తన ప్రేమ విషయాన్ని చెప్పిన కొద్ది రోజులకే భయంకరమైన క్యాన్సర్ ల్యుకేమియా తనకు ఉందని, ఎక్కువ రోజులు బతకడని ఒమర్‌కు తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఆ ప్రేమికులిద్దరూ తీవ్ర బాధలోకి కూరుకుపోయారు. ఒమర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అమీ ఒక్కతే స్కూల్‌కు వెళ్లొస్తుండేది. మరో మూడు రోజులు మాత్రమే ఒమర్ బతుకుతాడని తెలిసి.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒమర్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ నిర్ణయాన్ని ఇరువురి కుటుంబసభ్యులకు తెలిపింది. ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అమీ తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో గత సోమవారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో వీల్ చైర్‌పై ఉన్న ఒమర్.. అమీ చేతికి రింగ్ తొడిగాడు. ఆ వెంటనే తన భర్తగా మారిన ప్రేమికుడిని ఆస్పత్రి అధికారుల అనుమతితో కారిడార్‌లో ప్రేమగా కొన్ని మాటలు చెప్పుకుంటూ అటూఇటూ తిప్పింది. ఆ మూడు రోజులు.. క్షణం కూడా విడిచిపెట్టకుండా తన చేతిలో చేయ్యేసి ఆస్పత్రిలోనే ఉండిపోయింది. అమీ కళ్లముందే ఒమర్ శాశ్వతంగా లోకం విడిచి వెళ్లిపోయాడు. ఆ క్షణం అమీ కళ్లలో.. నీళ్ల సుడిగుండం, చేతిలో ఒమర్ చేయి. భారంగా పక్కకు పెట్టింది. ఈ సందర్భంగా ఒమర్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు చనిపోయినా ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన కోడలు తనకు కూతురిగా దొరికిందని చెప్పుతూ ప్రేమగా అమీని ఆలింగనం చేసుకొంది. -
'నా ప్రేమనంతా కూడగట్టి నీకు పంపిస్తున్నా'
'వన్ డైరెక్షన్ బ్యాండ్'.. ఈ పేరు మీరు ముందే విన్నారా.. ప్రపంచంలోని గొప్ప మ్యూజిక్ బ్యాండ్లలో ఇదీ ఒకటి. ఇందులోని సభ్యులంతా యువకులే. వీరు పాడితే అవతలివారు ఎగిరిగంతేయాల్సిందే. ఈ బృందంలోని హ్యారీ స్టైల్స్ అనే బ్యాండ్ బాబు.. ఓ పాఠశాల అమ్మాయికి ఐ లవ్ యూ అంటూ ప్రేమ సందేశం పంపాడు. అయితే, ఇది స్వార్థంతోనో, మనసుపడో కాదు.. ప్రాణాలతో పోరాడుతున్న ఆ బాలికకు ధైర్యం నింపేందుకు. న్యూజెర్సీలోని ఓ హైస్కూల్లో బ్రియన్నా అనే బాలిక చదువుతోంది. ప్రస్తుతం ఆమె ల్యుకేమియాతో బాధపడుతోంది. బ్రియాన్నా హ్యారీ స్టైల్స్‌కు ఫ్యాన్. ఈ విషయం తెలుసుకున్న హ్యారీ కదిలిపోయి స్వయంగా ఓ వీడియోను తయారు చేసి ట్విట్టర్లో ఆ బాలికకు పంపాడు. అందులో చిరిగిన జీన్స్ వేసుకుని ఉన్న హ్యారీ ' హాయ్ బ్రియాన్నా, నిన్ను కలిసినందుకు చాలా సంతోషపడుతున్నాను. నువ్వు నాకు చిన్న ఫ్యాన్వని విన్నాను. కానీ నేను మాత్రం నీకు పెద్ద అభిమానిని. నీ గురించి నేను మొత్తం విన్నాను. నువ్వు చాలా ధైర్యమైన దానివని తెలుసుకున్నాను. నా ప్రేమనంతా కూడగట్టి నీకు పంపిస్తున్నాను. నేను త్వరలోనే నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఉండు. ప్రేమతో.. ఐలవ్ యూ.. బై' అని వీడియో రికార్డు చేశాడు.