వెబ్సైట్లో ఎల్ఎఫ్ఎల్ ఖాళీల వివరాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తమ కార్యాలయంలోని నోటీసుబోర్డుపై డిస్ప్లే చేసినట్లు చెప్పారు.
ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ ఈ నెల 26న మధ్యాహ్నం ఒంటి గంటకు ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.