licker
-
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ 'తెలుగు తమ్ముళ్లు'!
తిరుపతి: మండలకేంద్రంలో తెలుగు తమ్ముళ్లు సరికొత్త వ్యాపారానికి తెరతీశారు. టీడీపీ నేత పులివర్తి నాని అనుచరులు సారా తయారీలో తలమునకలై ఉన్నారు. గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేసి మండల వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు గుర్తించారు. చంద్రగిరి మండలం, కొటాలలో సారా తయారీ చేస్తున్నారనే సమాచారంతో గురువారం ఎస్ఈబీ సీఐ లీలాకుమారి ఆధ్వర్యంలో దాడులు చేశారు. కొటాల ఎస్టీ కాలనీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో సారా ఊటను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొటాల పంచాయతీకి చెందిన టీడీపీ నేత పులివర్తి నాని అనుచరుడు చెంగయ్యతో పాటు మరో ముగ్గురున్నట్టు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సారాతో పాటు చెంగయ్యను చంద్రగిరి ఎస్ఈబీ కార్యాలయానికి తరలించారు. తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో చెంగయ్యతో పాటు మరికొంత మంది తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అంతేకాకుండా నిందితులు గతకొంత కాలంగా ఇక్కడి నుంచి తయారు చేస్తున్న సారాను మండల వ్యాప్తంగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన నిందితుడి కుమారుడు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా జైలుశిక్ష అనుభవించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇవి చదవండి: Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్! -
మహిళ రెండో పెళ్లి.. ఉమ్మిని నాకాలని కుల పెద్దల శిక్ష
ముంబై: కాలంతో పాటు మనం మారాలని అంటుంటారు. కానీ ఇంకా పలు గ్రామాల్లో పెద్దలుగా చెలామని అవుతున్న కొందరు వాళ్లు మారకపోవడమే గాక ఇతరులను తమ దారిలోనే నడవాలని అనుకుంటున్నారు. అదే తరహాలో ఇటీవల ఓ మహిళకు రెండో పెళ్లి చేసుకున్నందుకు గాను ఆ ప్రాంత కుల పెద్దలు ఆమెకు దారుణ శిక్ష విధించారు. కుల పెద్దల ఉమ్మిని నాకాలని ఆదేశించారు. ఈ దారుణ ఘటన మహారాష్ర్ట అకోలా జిల్లాలో చోటు చేసుకుంది. అకోలా జిల్లాకు చెందిన ఓ మహిళ(35)కు 2011లో వివాహమైంది. కుటుంబ గొడవల కారణంగా తన భర్తకు 2015లో విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2019లో ఆమె రెండో వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహాన్ని ఆమె కులమైన ‘నాథ్ జోగి’ పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆమె రెండో పెళ్లి గురించి మాట్లాడని ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆమె సోదరితో పాటు బంధువులను కుల పెద్దలు పంచాయతీకి పిలిపించారు. రెండో పెళ్లి చేసుకోవడం తప్పని అందుకు శిక్ష అనుభవించాలని తెలిపారు. చేసిన తప్పుకు గాను.. కుల పెద్దలంతా కలిసి అరటి ఆకులపై ఉమ్మి వేస్తారని, దాన్ని సదరు మహిళ నాకాలని ఆదేశించారు. అంతే కాకుండా రూ. లక్ష జరిమానా వేశారు. ఈ శిక్షపై తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత మహిళ.. నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో ఈ కుల పెద్దల నిర్వాకం బయటపడింది. ( చదవండి: నా దృష్టిలో నాగలక్ష్మి దేశంలోనే అత్యంత ధనవంతురాలు :సోనూసూద్ ) -
మహాత్మా.. మన్నించు
కోల్‌సిటీ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి, జాతీయ అహింసా దినత్సోవం అయిన ఆదివారం రోజు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మాంసం, మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. గాంధీజీ జయంతి రోజున దేశంలో మాంసం, మద్యం విక్రయాలను ప్రభుత్వాలు నిషేధించాయి. ఆ మహానీయుని త్యాగాలను స్మరించుకుంటూ... గాంధీజీ ఆశయాలను కొనసాగించడానికి నిషేదపు ఆజ్ఞలు విధించారు. కానీ, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ మార్కెట్లో మటన్, చికెన్, చేపలను వ్యాపారులు బహిరంగంగా మాసం విక్రయించారు. మరిన్ని చోట్ల కూడా కొందరు వ్యాపారులు మటన్, చికెన్ విక్రయించారు. బహిరంగ విక్రయాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు పవన్‌కుమార్, కిశోర్‌కుమార్‌తోపాటు సూపర్వైజర్లు మార్కెట్లో మొక్కుబడిగా దాడి చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపించాయి. అధికారులు మాంసం విక్రయించిన నిర్వాహకుల దుకాణాలను సీజ్ చేశారు. కొందరు వ్యక్తులు నగరంలోని వైన్‌షాపుల సమీపంలో చాటుగా అధిక ధరలకు మద్యం విక్రయించారు. -
పింఛన్ సొమ్ము ‘చుక్క’పాలు
హుకుంపేట : మన్యంలో చుక్కలేనిదే బండినడవడం లేదు. ఇల్లు గుల్లవుతున్నా..అనారోగ్యాలకు గురవుతున్నా..‘నాటు’వైపు పరుగులు తీస్తున్నారు. మన్యం మొనగాళ్లే కాకుండా మహిళలు కూడా ప్యాకెట్ చింపి గుటుక్కుమని తాగేస్తున్నారు. తీగలవలస పంచాయతీలోని పలు గ్రామాల్లో కొంతమంది గిరిజనులు సారా తయారు చేస్తూ రోజుకు రూ.వేలల్లో వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ తయారైన సారా హుకుంపేట,పాడేరు మండలాలకు రవాణా అవుతుంది.ఎక్సైజ్ అధికారులు అనేకసార్లు సారా దాడులు చేపట్టిన ఫలితం లేకపోతుంది. గురువారం ఈ ప్రాంతంలో సారా ఏరులై పారింది. పలుచోట్ల ప్యాకెట్లతో విక్రయాలు జరిగాయి.ఆడ,మగ తేడాలేకుండా సారాను కొనుగోలు చేశారు. కామయ్యపేట వద్ద పింఛను సొమ్ము పంపిణీ చేయడంతో పలు గ్రామాల వద్ధులంతా ఈ డబ్బులో రూ.200 వరకు సారాకే ఖర్చుపెట్టారు. -
చీప్‌గా లిక్కర్
► ఎక్సైజ్ పాలసీ ముసాయిదాకు ఆమోదం ► మండలం యూనిట్‌గా లెసైన్సులు ►లెసైన్సుదారులకే గ్రామాల్లో ►చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్ ►గుడుంబా అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు ►ఇకపై పోలీసు శాఖకూ బాధ్యతలు ►తయారీ, విక్రయాల నిరోధంలో విఫలమైతే ఇన్స్పెక్టర్లపై వేటు ► బేవరేజెస్ కార్పొరేషన్‌ను డిపార్ట్మెంట్గా మార్చాలని సీఎం ఆదేశం ► కొత్త మద్యం విధానంపై ఈనెల 15 తర్వాత నోటిఫికేషన్ ► పల్లెల్లో చవక మద్యం దుకాణాలకు సీఎం గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: ఇక గ్రామాల్లో సైతం అధికారికంగా మద్యం అమ్మకాలు జరగనున్నాయి. ఈ మేరకు రూపొందించిన నూతన మద్యం విధానం ముసాయిదాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోదముద్ర వేశారు. మండలం యూనిట్‌గా లాటరీ పద్ధతిలో లెసైన్సులు జారీ చేసి, సదరు లెసైన్సుదారుడికే గ్రామాల్లో చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. గుడుంబాను అరికట్టే బాధ్యతను ఆబ్కారీశాఖతో పాటు పోలీస్‌శాఖకు కూడా అప్పగించారు. ఎక్కడైనా గుడుంబా తయారీ, విక్రయాలను అడ్డుకోవడంలో విఫలమైతే ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేయాలని స్పష్టంచేశారు. అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న ఎక్సైజ్ పాలసీపై శుక్రవారం ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఆబ్కారీ శాఖ మంత్రి టి.పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ(ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి ఈ భేటీకి హాజరయ్యారు. ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కూడా సమావేశానికి పిలిపించారు. గుడుంబాను తరిమికొట్టడంపైనే ఈ సమావేశంలో సీఎం ప్రధానంగా దృష్టి సారించారు. ‘‘ప్రజల ప్రాణాలు తోడేస్తున్న గుడుంబాను తరిమికొట్టేందుకు బహుముఖ వ్యూహం అమలు చేయాలి. గ్రామాల్లో గుడుంబా తయారు చేసే వారి దగ్గర్నుంచి అమ్మకాలు జరిపే వరకు ఓ నెట్వర్క్ ఉంది. దాన్ని విచ్ఛిన్నం చేయాలి. గుడుంబా తయారుచేసే వారి మీద అవసరమైతే పీడీ యాక్టు ప్రయోగించాలి. ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యం కూడా గుడుంబా వ్యాపారం యథేచ్ఛగా సాగేందుకు కారణమైంది. ఇకపై ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎక్సైజ్, పోలీస్ శాఖలు కలిసి పనిచేయాలి. అయినా గుడుంబా తయారీ, అమ్మకాలు ఆయా మండలాల్లో సాగితే రెండు శాఖల ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేయాలి’’ అని సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రత్యేక మద్యం విధానం కోసం పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ‘‘అక్టోబర్ 1 నుంచి అమలుల్లోకి వచ్చే మద్యం విధానంపై ఈనెల 15 తర్వాత నోటిఫికేషన్ జారీ చేయాలి. గుడుంబా స్థానంలో తక్కువ ధర చీప్ లిక్కర్ తీసుకు వచ్చినా... గుడుంబాపై కఠినంగా వ్యవహరించకపోతే ఫలితం ఉండదు. గుడుంబా తయారీ దారులను గుర్తించాలి. సూత్రదారులను పట్టుకోవాలి. ఎక్సైజ్, పోలీస్ శాఖ కలిసి పనిచేస్తే గుడుంబాను పారదోలడం కష్టం కాదు’’ అని సీఎం పేర్కొన్నారు. గ్రామాలకు బీ-లెసైన్స్ గ్రామీణ మండలం యూనిట్‌గా ఈసారి మద్యం దుకాణాలకు లెసైన్సులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్ అధికారులు పాలసీ ముసాయిదా రూపొందించారు. మండలం యూనిట్ లెసైన్సుదారుడే గ్రామాల్లో చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్లు జారీ చేస్తారు. బీ-లెసైన్స్ పేరుతో ఇచ్చే ఈ లెసైన్సు కోసం ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తారు. ప్రజల ప్రాణాలకు హాని కలగని మోతాదులో అల్కాహాల్ ఉండేలా ప్రభుత్వ పర్యవేక్షణలో డిస్టిలరీల్లో చీప్ లిక్కర్ తయారీ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రూ. 15కే మద్యం సీసా అందుబాటులో ఉంటే ప్రమాదకరమైన చీప్ లిక్కర్ ఎవరూ తాగరనే నమ్మకం తనకుందని, తదనుగుణంగా అధికార యంత్రాంగం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. బేవరేజెస్ కార్పొరేషన్ ఇక డిపార్ట్మెంట్! తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌ను డిపార్ట్మెంట్గా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కంపెనీ చట్టం ప్రకారం బేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను శాఖ, సర్వీస్ ట్యాక్స్ విభాగాలు పన్ను వసూలు చేస్తుండడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చేసి, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులను కాంట్రాక్టు కిందకి మార్చారు. తెలంగాాణలో మాత్రం ప్రభుత్వ విభాగం(డిపార్ట్మెంట్)గానే దీన్ని మార్చాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. దీనికి ఎక్సైజ్ శాఖలో డీఐజీ స్థాయి పోలీస్ అధికారిని నియమించాలని నిర్ణయించారు. రిటైర్డ్ సీనియర్ అధికారుల సేవలను కూడా ఎక్సైజ్ శాఖకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. గుడుంబా అనర్థాలపై ప్రచారం గుడుంబా వల్ల కలిగే అనర్థాలపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించి, ప్రజలను చైతన్యవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. లఘుచిత్రాలు, పోస్టర్లు, కరపత్రాలతోపాటు సాంస్కృతిక సారథి కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. గుడుంబా స్థావరాల వివరాలు ఇచ్చే వారికి అవార్డులు ఇవ్వాలన్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు గుడుంబా వ్యతిరేక విధానాన్ని అమలు చేసే విషయంలో క్రియాశీలంగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారులు సమావేశమై విధివిధానాలను రూపొందించాలని సూచించారు. -
ప్రభుత్వమే మద్యం అమ్మడమా?
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ఆదాయాన్ని పెంచుకోవాలనే మత్తు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు రావాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మద్యం విషయంలో సీఎం ఎన్నికలకు ముందు చెప్పినదానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేపట్టాలనేది ఒక దగుల్బాజీ విధానమని, అలాంటి ఆలోచనను మానుకోవాలని సూచించారు. తమిళనాడులో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయడం వల్ల సమాజంపై పడుతున్న దుష్ర్పభావంపై అక్కడి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పారు. ఎన్నికలపుడు చంద్రబాబు ఏ వేదిక ఎక్కినా మహిళలవైపు చూసి బెల్ట్‌షాపులు రద్దు చేస్తానని, మద్యం మహమ్మారి వల్ల ఆడపడుచులు ఎన్ని బాధలు పడుతున్నారో తనకు తెలుసునంటూ ఆవేదన ఒలకబోశారని, తీరా అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలను ప్రోత్సహించే చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘తొలి ఐదు సంతకాల్లో నాలుగోదిగా మద్యం బెల్ట్‌షాపులను రద్దు చేశామని చెప్పారు. కానీ ఆ తరువాత అది అమలైందో లేదో పట్టించుకోలేదు. రైతుల రుణాలను మాఫీ చేసేశాం.. డ్వాక్రా మహిళలకు ఆర్థికసాయం చేసేశాం అని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్లుగానే బెల్ట్‌షాపుల రద్దుపై సంతకం చేసి రద్దు చేసేశామని చెప్పుకుంటున్నారు’’ అని పద్మ విమర్శించారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామన్న సీఎం, మంత్రులు మద్యం ఆదాయం పెంపుదలపై అధికారులకు టార్గెట్ల(లక్ష్యాల)ను నిర్దేశిస్తున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు ఎంతసేపూ ఆదాయం పెరగాలి, పెరగాలంటూ మద్యం ఆకర్షణలో పడిపోయి.. మత్తులో పడిపోతున్నారని, ప్రజల జీవితాలను, ముఖ్యంగా మహిళల బతుకులను ఇదెంత దుర్భరం చేస్తోందో గుర్తించట్లేదని ఆమె విమర్శించారు.