2023 నాటికి లిగో ఇండియా
వాషింగ్టన్: గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనలకు నిర్మించే భారత్ లిగో ప్రాజెక్టు 2023 నాటికి అందుబాటులోకి వస్తుందని అమెరికన్ శాస్త్రవేత్త, లిగో హన్ఫోర్డ్ అబ్జర్వేటరీ హెడ్ ఫ్రెడ్ రాబ్ తెలిపారు. సహచర భారతీయ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసేందుకు లిగో శాస్త్రవేత్తలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ (గాంధీనగర్), ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(పుణె), రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(ఇండోర్)లో అనేకసార్లు పర్యటించారని చె ప్పారు.
లిగో ఇండియా నిర్మాణ ం, నిర్వహణ ప్రాధమిక బాధ్యతల్ని ఈ మూడు పర్యవేక్షిస్తాయి. గాంధీనగర్ ఐపీఆర్ను అనువైన ప్రదేశంగా గుర్తించామన్నారు. భారత్లో లిగో ప్రాజెక్టుకు కేంద్రం అనుమతితో గురుత్వాకర్షణ తరంగాలపై కీలక పరిశోధనలు, లోతైన పరిశీలన సాధ్యమవుతుంది.