అలరించిన సరిగమ పాటల పోటీ
ఆకివీడు : స్థానిక సరిగమ సంగీత పరిషత్ ఆధ్వర్యంలో గ్రామంలోని లయన్స్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సినిమా పాటల పోటీ ఉర్రూతలూగించింది. పోటీలను వైఎస్సార్ సీపీ మండల యువజన కమిటీ అధ్యక్షుడు అంబటి రమేష్ ప్రారంభించారు. లయన్స్ ప్రతినిధి డాక్టర్ ఎంవీ సూర్యనారాయణరాజు జ్యోతి ప్రజ్వలన చేశారు. పాటల పోటీల అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మద్రాసుకు చెందిన టేకీ బాలాజీ వయోలి న్ కచేరి రంజింపజేసింది. విజేతలను సంగీత పరిషత్ అ««దl్యక్షుడు సింగవరపు కోటేశ్వరరావు ప్రకటించారు. మొదటి బహుమతిని మంజుశ్రీ(నర్సాపురం), ద్వితీయ బహుమతిని పూర్ణిమ(కాకినాడ), తృతీయ బహుమతిని పావని(చిలకలూరిపేట), 4వ బహుమతిని శృతి (హైదరాబాద్), 5వ బహుమతిని బాలాదిత్య(ఆకివీడు), ఆరో బహుమతిని ప్రియాంక(ఆకివీడు), ఏడో బహుమతిని మాధవి అందుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ కొణాడ అశోక్ సత్య, భోగిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సరిగమ పురస్కారాల అందజేత
ఇది ఇలా ఉండగా సంగీత పరిషత్ ఆధ్వర్యంలో సరిగమ పురస్కారాలను సినీనటుడు వి.సాయికిరణ్, పారిశ్రామిక వేత్త కేఏ సూర్యనారాయణ రాజులకు అందజేశారు. సరిగమ కళా సత్కారాన్ని హాస్యనటుడు జబర్దస్త్ అప్పారావు, పులగం చిన్నారాయణ, బాలాజీ టేకే, గాయకుడు చంద్రతేజ, రంగస్థల నటుడు తాళాబత్తుల వెంకటేశ్వరరావు, చించినాడ సత్యకుమార్, ఉపాధ్యాయులు ముదునూరి శివరామరాజు, మెడవంకల రత్నకుమార్లు అందుకున్నారు. కార్యక్రమంలో పౌరాణిక దర్శక బ్రహ్మ, నంది అవార్డు గ్రహీత పువ్వాడ ఉదయ భాస్కర్, పరిషత్ అధ్యక్షుడు సింగవరపు కోటేశ్వరరావు, కొల్లి వెంకన్నబాబు, మహ్మద్ మదనీ, డాక్టర్ ఎస్.రామరాజు, గుండా రామకృష్ణ, పోశంశెట్టి మురళీ, జుంగా దాసు, జగ్గురోతు విజయ్, పుప్పాల పండు, మహ్మద్ జక్కీ, కందుల సత్యనారాయణ పాల్గొన్నారు.