liquor trafficking
-
ఎవరైనా.. ఎంతటి వారైనా..
సాక్షి, అమరావతి: దశలవారీ మద్యం నియంత్రణకు కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ప్రభుత్వ ఆదేశాల మేరకు చురుగ్గా వ్యవహరిస్తోంది. మద్యం అక్రమ రవాణా చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించడం లేదు. ఫలితంగా అక్రమ మద్యం కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు సైతం పట్టుబడుతున్నారు. వీరిలో పోలీస్, ఎక్సైజ్ శాఖలతోపాటు ఇతర విభాగాల ఉద్యోగులు కూడా ఉన్నారు. 4 నెలల్లో 233 మంది ఉద్యోగుల పట్టివేత ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటైన నాలుగు నెలల వ్యవధిలో 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సుమారు 50 వేల మందిని ఎస్ఈబీ అరెస్ట్ చేసింది. ► మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 233 మంది ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసే సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగులూ ఉండటం గమనార్హం. ► కేసుల్లో పట్టుబడిన వారిలో ఎస్ఈబీ ఉద్యోగులు 65 మంది ఉండగా.. మిగిలిన 168 మంది ఇతర శాఖల ఉద్యోగులు. ► కృష్ణా జిల్లాలో 27 మంది, కర్నూలులో 48 మంది, పశ్చిమ గోదావరిలో 26 మంది ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడ్డారు. ► ఎస్ఈబీ ఉద్యోగుల్లో 25 మందిపై అభియోగాలు నమోదు కాగా.. 9 మందిని సస్పెండ్ చేశారు. మరో 10 మంది అరెస్ట్ అయ్యారు. ఆరుగురిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఎంతటి వారినైనా ఉపేక్షించం అక్రమ మద్యం కేసుల్లో ఎంతటి వారున్నా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎస్ఈబీ ఆవిర్భవించిన నాలుగు నెలల్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. పదే పదే పట్టుబడితే పీడీ కేసులు నమోదు చేస్తాం. – వినీత్ బ్రిజ్లాల్, ఎస్ఈబీ కమిషనర్ -
అప్పులు తీర్చడానికి మద్యం అక్రమ రవాణా: కంప్యూటర్ ఇంజనీర్ అరెస్టు
అతడో కంప్యూటర్ ఇంజనీర్. చేస్తున్న ఉద్యోగానికి తోడు డబ్బు సంపాదన కోసం ఆన్లైన్లో వెండి ట్రేడింగ్ చేసేవాడు. అందులో 7 లక్షల నష్టం వచ్చింది. దాన్ని పూడ్చుకోడానికి మద్యం అక్రమ రవాణాలోకి దిగాడు! చివరకు పోలీసులకు చిక్కాడు!! ఢిల్లీ నుంచి హర్యానాకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న అతగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వినోద్ అలియాస్ భోలు (25) హర్యానా నివాసి. 2010 సంవత్సరంలో అతడు ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఈమధ్యకాలంలో అతడు మద్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. తాను గత రెండేళ్లుగా హర్యానా నుంచి ఢిల్లీకి మద్యం రవాణా చేస్తున్నట్లు వినోద్ పోలీసులకు తెలిపాడు. గతంలో తాను ఆన్లైన్లో వెండి ట్రేడింగ్ చేసేవాడినని, అందులో ఏడు లక్షల రూపాయల నష్టం రావడంతో అప్పులు తీర్చడానికి ఇలా మద్యం అక్రమ రవాణా మార్గాన్ని ఎంచుకున్నానని అతడు చెప్పినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైం బ్రాంచి) రవీంద్ర యాదవ్ తెలిపారు. మద్యం రవాణా చేస్తూ ఏదైనా వాహనం పట్టుబడితే దాన్ని విడిపించుకోవడం అసాధ్యమని.. ఎప్పుడూ ఫైనాన్స్ చేసిన వాహనాలనే ఉపయోగించేవాడు. గతంలో 2011లో కూడా మద్యం రవాణా కేసులో అరెస్టయ్యాడు. బాగా అర్ధరాత్రిపూట మాత్రమే ప్రయాణాలు చేసేవాడని, కొన్నిసార్లు హర్యానా తిరిగి వెళ్లేటప్పుడు దారిలో ప్రయాణికుల నుంచి డబ్బు తీసుకుని ఎక్కించుకునేవాడని పోలీసులు తెలిపారు. కొన్నాళ్ల తర్వాత అలా ఎక్కించుకున్న ప్రయాణికులను దోచుకోవడం కూడా మొదలు పెట్టాడట!! అతడితో పాటు ఇంకా ఎవరెవరు ఈ గ్యాంగులో ఉన్నారో అందరినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.