'వడ్డెర్లను ఎస్టీల జాబితాలో చేర్చాలి'
విజయనగరం: సంచార జాతులుగా దుర్భర జీవితం గడుపుతున్న వడ్డెర్లను ఎస్టీల జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం నేతలు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఆదివారం సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నేతలు కన్నయ్య, వెంకటరమణ, శివ, శంకర్ మాట్లాడారు.
వడ్డెర్ల కోసం ప్రత్యేక కళాశాలలు ఏర్పాటుచేయాలని, స్కాలర్షిప్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. క్వారీ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని, పనిచేస్తున్న క్వారీల్లో 30 శాతం వాటా వడ్డెర్లకు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మండల స్థాయి కార్యవర్గాలను ఎన్నుకున్నారు.